మద్యానికి బానిసైన తండ్రిని చంపేసిన కుమార్తె

బంధాలు.. అనుబంధాలు.. కుటుంబ వ్యవస్థల మధ్య చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఇప్పుడు షాకింగ్ గా మారుతున్నాయి.

Update: 2024-05-02 06:46 GMT

బంధాలు.. అనుబంధాలు.. కుటుంబ వ్యవస్థల మధ్య చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఇప్పుడు షాకింగ్ గా మారుతున్నాయి. తరచూ చోటు చేసుకుంటున్న నేరాలు.. కుటంబ సభ్యుల మధ్య చోటు చేసుకోవటం అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన తండ్రిని భరించలేని కుమార్తె హత్య చేసిన వైనం సంచలనంగా మారింది.

తమిళనాడులోని కన్నియాకుమరి జిల్లా పూదప్పాండికి చెందిన సురేశ్ (46) కు భార్య.. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన భర్తను భరించలేక ఒక కూతుర్ని తీసుకొని భార్య వెళ్లిపోయింది. తల్లి వెళ్లిపోయినప్పటికీ పెద్ద కుమార్తె మాత్రం తండ్రి వద్దే ఉండేది. ఇదిలా ఉండగా గత నెల 26న అనుమానాస్పద రీతిలో సురేశ్ మరణించాడు. దీనిపై పోలీసులు ఆరా తీయగా తన తండ్రి మద్యం మత్తులో చనిపోయి ఉంటాడని పేర్కొంది.

అయితే.. పోస్టుమార్టం రిపోర్టు అందుకు భిన్నమైన వివరాల్ని వెల్లడించింది. సురేశ్ తలకు బలమైన గాయం తగలటం కారణంగా మరణించినట్లుగా పేర్కొంది. తలకు గాయాలు ఉన్న విషయాల్ని వెల్లడించింది. దీంతో.. పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. చివరకు పెద్ద కుమార్తె ఆర్తి తీరుపై అనుమానాలు వ్యక్తం కావటంతో ఆమెను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేశారు.

దీంతో.. ఆమె అసలు నిజాన్ని వెల్లడించింది. తన తండ్రిని తానే హత్య చేసినట్లుగా ఒప్పుకుంది. మద్యం మత్తులో ప్రతి రోజు తన తండ్రి తనతో గొడవపడేవాడని.. హత్యకు ముందు రోజు తనపై దాడికి ప్రయత్నించినట్లుగా చెప్పింది. ఈ సందర్భంలో తన తండ్రిని నెట్టేయటంతో గోడకు తల తగలటంతో దెబ్బ తగిలిందని చెప్పింది. తర్వాతి రోజు తన పట్ల అసభ్యంగా మాట్లాడటంతో తాను గొంతు నులిమినట్లుగా పేర్కొంది. దీంతో.. తన తండ్రిని చంపినట్లుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Tags:    

Similar News