విశాఖలో వైసీపీకి భారీ షాక్ ?
ఒక ఫైన్ మార్నింగ్ అన్నీ చూసుకుని వైసీపీ జెండా పీకేసి కూటమి శిబిరంలోకి జంప్ చేయడానికి పెద్ద ఎత్తున వైసీపీ కార్పోరేటర్లు రెడీగా ఉన్నారని అంటున్నారు.
విశాఖ మేయర్ పీఠాన్ని 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. మూడున్నరేళ్ళ తరువాత ఏపీలో అధికారం మారడంతో విశాఖలో కూడా రాజకీయం మొత్తం మారుతోంది. విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవశం చేసుకోవడానికి చురుకుగా పావులు కదుప్తోంది.
అన్నీ లాంచనాలూ ఈ మేరకు పూర్తి అయినట్లే అంటున్నారు. ఇక ముహూర్తం ఒక్కటే ఖరారు కావాల్సి ఉందని అంటున్నారు ఒక ఫైన్ మార్నింగ్ అన్నీ చూసుకుని వైసీపీ జెండా పీకేసి కూటమి శిబిరంలోకి జంప్ చేయడానికి పెద్ద ఎత్తున వైసీపీ కార్పోరేటర్లు రెడీగా ఉన్నారని అంటున్నారు.
విశాఖ కార్పోరేషన్ లో వైసీపీకి 58 మంది దాకా కార్పోరేటర్లు ఉన్నారు. 99 మంది కార్పోరేట్లు ఉండే కార్పోరేషన్ లో ఇది మంచి మెజారిటీ. అదే సమయంలో టీడీపీకి 30 మంది దాకా కార్పోరేటర్లు ఉన్నారు. తాజా ఎన్నికల్లో విశాఖ సిటీ రూరల్ అంతా టీడీపీ వారే గెలిచారు. దాంతో ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా టీడీపీకి పెద్ద ఎత్తున బలం పెరిగింది. అదే విధంగా జనసేన బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు. ఈ బలమంతా చేరితే సులువుగా 45 దాటుతోంది. ఇపుడు వైసీపీ నుంచి పాతిక మంది దాకా కార్పోరేటర్లు టీడీపీలోకి చేరుతారు అని అంటున్నారు.
వారంతా చేరితే విశాఖ కార్పోరేషన్ కూటమికి చాలా ఈజీగా దక్కుతుంది అని అంటున్నారు. మూడింట రెండు వంతుల మంది కార్పోరేటర్లు టీడీపీలోకి జంప్ అవుతున్నందున్న వైసీపీ కార్పోరేషన్ లో విలీనం అవుతుందని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీలోకి తమ కార్పోరేటర్లు పోకుడా మాజీ మంత్రి గుడివాడ అమరనాధ్ చేసిన రాయబారాలు జరిగిన చర్చలు పూర్తిగా విఫలం అయ్యాయని అంటున్నారు.
దాంతో పాటుగా తమను ఏ మాత్రం గత అయిదేళ్ళలో పట్టించుకోలేదని పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లుగా వ్యవహరిచిన వారు అంతా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు అని కార్పోరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు అని అంటున్నారు. తమ దారి తాము చూసుకుంటామని వారు తెగేసి చెప్పారని టాక్ నడుస్తోంది.
దీంతో వైసీపీకి సీన్ మొత్తం అర్ధం అయిపోయింది అని అంటున్నారు. ఇక కార్పోరేటర్ల గోడ దూకుళ్ళను తాము అడ్డుకోలేమని తెలియడంతో వైసీపీ నేతలు మౌనం వహిస్తున్నారు అని అంటున్నారు. తొందర్లో స్టాండింగ్ కమిటీల ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లోనే టీడీపీకి అన్నీ దక్కేలా వైసీపీ కార్పోరేటర్లు ఓట్లు వేయబోతున్నారు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే 2026 మార్చి దాకా ఉండే విశాఖ కార్పోరేషన్ మేయర్ పీఠం టీడీపీకే దక్కుతుందని తెలుస్తోంది. ఉప మేయర్లుగా బీజేపీ జనసేనలకు చెరొకటి ఇస్తారని వైసీపీని విశాఖ సిటీ పాలిటిక్స్ లో పూర్తిగా సైడ్ చేసే బ్రహ్మాండమైన వ్యూహంగా దీనిని అమలు చేస్తున్నారు అని అంటున్నారు.