జగన్ మాదిరిగానే కన్నడ సిద్ధ రామయ్య !

పాలనలోనూ అద్భుతాలు చేశారు. సామాన్యుల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు.

Update: 2024-07-19 03:26 GMT

సిద్ధ రామయ్య ఏడున్నర పదుల వయసు ఉన్న వారు. రాజకీయంగా సీనియర్ మోస్ట్ నేత. ఆయన 2013 నుంచి 2018 దాకా ఒంటి చేత్తో కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని నిభాయించారు. అప్పటికి పదేళ్ళ నుంచి ఒక సీఎం ఏకంగా ఫుల్ టెర్మ్ అయిదేళ్ళ పూర్తి చేయలేదు ఆ ఘనతను సిద్ధరామయ్య సాధించి చూపించారు.

పాలనలోనూ అద్భుతాలు చేశారు. సామాన్యుల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు. ఆ మార్క్ ఆయనకు ఉండడం వల్లనే 2023లో జరిగిన ఎన్నికల్లో సిద్ధ రామయ్యకే కాంగ్రెస్ హై కమాండ్ అగ్ర తాంబూలం ఇస్తూ డీకే శివ కుమార్ ని పక్కన పెట్టి మరీ సీఎం గా చేసింది.

బలహీన వర్గాలకు చెందిన నేతగా ఉన్న సిద్ధరామయ్య అనుభవం కలిగిన వారు అని కాంగ్రెస్ హై కమాండ్ ఆయనకు పట్టం కట్టింది. అయితే కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత హామీలే ఇపుడు ఆ ప్రభుత్వానికి గుదిబండలుగా మారుతున్నాయని అంటున్నారు. ఉచిత హామీలను అమలు చేయడానికి ఆర్థికంగా పెను భారం కావడంతో మద్యం ధరలను విపరీతంగా పెంచేసారు అని అంటున్నారు.

ఇక విద్యుత్ చార్జీలు కూడా పెంచేసారు. ఇదంతా ఉచిత విద్యుత్ హమీతో వచ్చిన తంటా అని అంటున్నారు. దాంతో హోటళ్ళు, వాణిజ్య సంస్థలు పరిశ్రమలకు విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. తిరిగి ఆ భారం ప్రజల మీద కూడా పరోక్షంగా పడుతోంది అని అంటున్నారు.

ఇక మరో వైపు చూస్తే కర్ణాటకలోనూ రోడ్లు ఏ మాత్రం బాగా లేవు అని జనాలు మండిపడుతున్నారు. గుంతల రోడ్లు బాగుచేయమని కోరుతున్నారు. అయితే అభివృద్ధికి నిధులు లేవని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. రోడ్లు కూడా వేయలని వాతావరణం ఒక వైపు ఉంటే గ్రామాలలో మంచి నీరు అందించే పరిస్థితి కూడా కనిపించడం లేదు అని అంటున్నారు.

ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలలో అభివృద్ధి చేసుకునేందుకు కూడా నిధులు లేవు. దాంతో వారంతా అధికార పార్టీలో ఉంటూ కూడా తీవ్ర అసంతృప్తికి లోను అవుతున్నారని అంటున్నారు. మేము రోడ్లు వేయలమని చెప్పేందుకు కూడా ఎమ్మెల్యేలు వెనకాడడం లేదు. బాహాటంగానే జనాలకు చెబుతూ తప్పు తమది కాదు అన్నట్లుగా ప్రభుత్వ పెద్దల మీద తోస్తున్నారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్చ ఉంటోంది. దాంతో వారు మండిపడుతున్నారు. ఓపెన్ గానే ప్రభుత్వం మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉచిత పధకాలతో నానా అవస్థలు పడుతున్న సిద్ధరామయ్య ప్రభుత్వం ఇపుడు లోకల్ సెంటిమెంట్ తో చాలా వరకూ గట్టెక్కాలని చూస్తోందని అంటున్నారు.

పరిశ్రమలలో కింది స్థాయి ఉద్యోగాలు నూటికి నూరు శాతం కర్ణాటక వాసులకే ఇవ్వాలని పేర్కొంటూ ఏకంగా ఒక చట్టం తీసుకుని రావడానికి సిద్ధపడుతోంది అని అంటున్నారు.ఇది ఇపుడు పారిశ్రామికవేత్తలకు ప్రాణ సంకటంగా పరిణమించింది అని అంటున్నారు. లోకల్ నినాదంతో రాజకీయంగా సిద్ధరామయ్య ఏదైనా సెంటిమెంట్ లెక్కలు వేసుకోవచ్చు కానీ అది చివరికి పరిశ్రమలకే ఇబ్బంది పెట్టేలా ఉంది అని అంటున్నారు.

ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానిని చట్టం చేయడం ద్వారా స్థానిక సమస్యలు అభివృద్ధి లేమి వంటి వాటి నుంచి బయట పడవచ్చు అని సిద్ధరామయ్య చూస్తున్నారు అని అంటున్నారు. అయితే ఈ సెంటిమెంట్ బెడిసికొడితే అసలుకే ఎసరు వస్తుందని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో సిద్ధరామయ్య అసమ్మతిని ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ సీట్లు కాంగ్రెస్ కి తగ్గాయి అంటే పాలనాపరమైన వైఫల్యం అని అంటున్నారు. ఇపుడు ఈ లోకల్ బిల్లి సీఎం పీఠాన్ని కాపాడుతుందా లేక ఎసరు పెడుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే పారిశ్రామికవేత్తల లాబీ చాలా పెద్దది. సో ఇపుడు కర్ణాటక రాజకీయం చూస్తే ఉచితాలు ఏకంగా కుర్చీకే ఎసరు పెట్టేలా ఉన్నాయని అంటున్నారు ఏపీలో జగన్ మాజీ సీఎం అవడానికి అదే కారణం కాబట్టి అంతా కన్నడ రాజకీయాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు