ఏపీ తెలంగాణాలలో ఒకేసారి ఎన్నికలు...!?

అయితే చరిత్ర చూస్తే తెలంగాణాలో ఏపీలో ఎన్నికలు ఎపుడూ ఒకేసారి జరిగినది లేదు ఉమ్మడి ఏపీలో కూడా ఒకసారి తెలంగాణాలో జరిగితే మరోసారి తెలంగాణాలో జరిగాయి.

Update: 2024-01-10 03:49 GMT

ఏపీలో తెలంగాణాలో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయా. కేంద్ర ఎన్నికల సంఘం ఏమి ఆలోచిస్తోంది. ఈ విషయం మీద వైసీపీ చేసిన ఫిర్యాదుల గురించి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా చూస్తుందా ఇవన్నీ ప్రశ్నలే. అయితే చరిత్ర చూస్తే తెలంగాణాలో ఏపీలో ఎన్నికలు ఎపుడూ ఒకేసారి జరిగినది లేదు ఉమ్మడి ఏపీలో కూడా ఒకసారి తెలంగాణాలో జరిగితే మరోసారి తెలంగాణాలో జరిగాయి.

అందుకే 2009 ఎన్నికల వేళ అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్సార్ టీయారెస్ కి వ్యతిరేకంగా మొదట్లో పెద్దగా మాట్లాడలేదు. కానీ తెలంగాణా ఎన్నికలు ముందు అవగానే నంద్యాలకు వచ్చి అక్కడ సభలో మాట్లాడుతూ విభజన జరిగితే తెలంగాణాకు వీసా పాస్ పోర్టు తెచ్చుకుని వెళ్ళాలని హాట్ కామెంట్స్ చేశారు దాని మీద టీఆర్ఎస్ ప్రతి విమర్శలు కూడా చేసింది.

ఇవన్నీ పక్కన పెడితే ఏపీలోని వారంతా హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో ఉంటారు అక్కడ అత్యధిక జనాభా సీమాంధ్రులే ఉంటారు డౌట్ ఉంటే ఈసారి సంక్రాంతి పండుగ ఒకసారి చూస్తే చాలు సీన్ అర్ధం అవుతుంది. మొత్తం సగానికి పైగా హైదరాబాద్ ఖాళీ అవుతుంది అంటే సీమాంధ్రులు ఎంత పెద్ద సంఖ్యలో ఉంటున్నారు అన్నది తెలుస్తుంది.

మరో వైపు చూస్తే తెలంగాణాలో ముందు ఎన్నికలు పెట్టి ఆ తరువాత ఏపీలో ఎన్నికలు పెడితే అక్కడా ఇక్కడా ఓటేసే వారు రెండు చోట్లా ఓట్లు ఉన్న వారు కచ్చితంగా ఏపీకి తరలి వస్తారు అని అంటున్నారు. అంటే ఈ ఏడాది రెండు సంక్రాంతులు అన్న మాట. ఒకటి సంప్రదాయ పండుగ అయితే మరొకటి ఎన్నికల పండుగ.

ఈ రెండు పండులక కోసం ఏపీకి అటు నుంచి ఇటుగా జన సునామీ వస్తుంది అని అంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్ మీదనే వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రెండు ఓట్లు ఉన్నాయని అవి లక్షలలో ఉన్నాయని వాటి మీద విచారణ చేసి రెండో ఓటుని తొలగించాలని కూడా గట్టిగా కోరింది.

అంతే కాదు కీలకమైన డిమాండ్ చేసింది. ఒకేసారి తెలంగాణా ఏపీకి ఎన్నికలు జరిపిస్తే కచ్చితంగా రెండు ఓట్లు ఉన్న వారు ఒకే చోట ఒకేసారి ఓటు హక్కు వినియోగించుకుంటారు అని అపుడు డబులింగ్ ఉండదని, డబుల్ యాక్షన్ ఉండదని కూడా వైసీపీ అంటోంది.

మరి కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద నిర్ణయం ఎలా తీసుకుంటుందో చూడాలి. లోక్ సభ స్థానాలకు మాత్రమే తెలంగాణాలో ఎన్నికలు జరుగుతాయి. అదే ఏపీలో అసెంబ్లీకి ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. రెండు చోట్లా ఓకసారి ఎన్నికలు అంటే ఈసీ ఏమాలోచిస్తుందో చూడాలి. ఈసారి ఎనిమిది దశలుగా ఎన్నికలు లోక్ సభకు నిర్వహించాలని భావిస్తోందీని అంటున్నారు మొదటి దశలో ఏపీకి ఎన్నికలు అంటున్నారు

ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పెద్ద ఎత్తున వస్తున్నరు హడావుడి అంతా ఏపీలోనే ఎక్కువగా కనిపిస్తోంది. దంతో ఒకేసారి రెండు చోట్ల ఎన్నికలకు సీఈసీ రెడీ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News