రాజు వర్సెస్ శ్రావణి.. టీడీపీలో ఈ రాజకీయం తెలుసా ..!
టీడీపీ తరఫున తొలిసారి విజయం దక్కించుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువ అవుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు
టీడీపీ తరఫున తొలిసారి విజయం దక్కించుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువ అవుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు.. చాలా సింప్లిసిటీని కూడా పాటిస్తున్నారు. ఈ విషయంలోనూ తేడా లేదు. అందరినీ కలుపుకొని పోతున్నారు. దీనిని కూడా తక్కువగా చూసే అవకాశం లేదు. అయితే.. కొన్నికొన్ని చోట్ల మాత్రం యువ ఎమ్మెల్యేల మధ్య రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.
టీడీపీ నుంచి ఈ సారి విజయం దక్కించుకున్న వారిలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. శింగనమల నుంచి విజయం దక్కించుకున్న శ్రావణి శ్రీ.. ప్రజలకు బాగానే చేరువ అవుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్క రించేందుకు కూడా ఆమెప్రాధాన్యం ఇస్తున్నారు. విద్యావంతురాలు కావడం ఆమెకు ప్లస్‌గా మారింది. ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదులను స్వీకరించే విషయం నుంచి వాటిని పరిష్కరించే దాకా ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా అక్రమాలకు అవకాశం లేకుండా ఉన్నారు.
ఇక, మడకశిర నుంచి విజయం దక్కించుకుని తొలిసారి అసెంబ్లీలోకి అడుగులు వేసిన ఎం.ఎస్ రాజు కూడా.. మంచి పేరు తెచ్చుకుంటున్నారు. సింప్లిసిటీకి పెద్దపీట వేస్తున్నారు. ప్రజలతోనూ మమేకం అవుతున్నారు. ఈ ఇద్దరు కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వారే. అయితే.. ఎటొచ్చీ.. చిన్న చిన్న రాజకీయ కారణాలతో ఇద్దరూ వార్తల్లోకి ఎక్కారు. తన సొంత నియోజకవర్గం శింగనమల కావడంతో పాటు.. తన సొంత మండలం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉందని రాజు చెబుతున్నారు.
అయితే.. శింగనమల ఎమ్మెల్యేగా ఉన్న శ్రావణి.. తన మండలానికి సంబంధించిన సమస్యలను పక్కన పెడుతున్నారని.. దీనివెనుక ఏదో ఉద్దేశం ఉందని రాజు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆయన ప్రజాఫిర్యా దులు స్వీకరించే కార్యక్రమంలో లైన్‌లో నిలబడి.. శ్రావణి శ్రీకి తన సొంత మండలానికి సంబంధించిన సమస్యలను వివరించారు. అంతేకాదు.. తన సొంత మండలానికి సంబంధించిన పనులు పెండింగులో ఉన్నాయని.. వాటిని పరిస్కరించే ప్రయత్నం చేయాలని కూడా ఆయన అభ్యర్థించారు. ఈ పరిణామం రాజకీయంగా ఇద్దరి నేతల మధ్య ఏదో జరుగుతోందన్న చర్చకు దారితీసింది. ఇలాంటివి రాకుండా చూసుకుంటే యువ ఎమ్మెల్యేలకు మరిన్ని మంచిమార్కులు పడతాయనడంలో సందేహం లేదు.