కొత్త సిట్ డ్యూటీ ఎక్కేది అప్పుడేనా ?

అలాగే ఏపీ ప్రభుత్వం ఇద్దరి అధికారులను ఎంపిక చేసి చెప్పాలి.

Update: 2024-10-05 18:45 GMT

సుప్రీంకోర్టు అదేశాల మేరకు అయిదుగురు సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు అవుతోంది. ఇందులో కేంద్ర అధికారులు ఇద్దరు, ఏపీకి చెందిన అధికారులు మరో ఇద్దరూ ఉంటారు. ఇక ఒక క్వాలిటీ టెస్టింగ్ ఆఫీసర్ ఉంటారు. సీబీఐ టోటల్ పర్యవేక్షణలో ఈ కొత్త సిట్ పనిచేస్తుంది.

ఇక కొత్త సిట్ లో ఏ ఏ అధికారులు ఉంటారు అన్నది ఇంకా తెలియదు. కేంద్రం ఇద్దరు అధికారుల పేర్లు ఇవ్వాలి. అలాగే ఏపీ ప్రభుత్వం ఇద్దరి అధికారులను ఎంపిక చేసి చెప్పాలి. అలాగే క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ఎవరో కూడా తెలియాలి.

ఇక సిట్ విచారణకు సుప్రీంకోర్టు నిర్దిష్టమైన కాల పరిమితి విధించలేదు దాంతో సిట్ సభ్యుల నియామకం తో పాటు విధులను చేపట్టేది ఎపుడు అన్న చర్చ సాగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

తిరుమలలో ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు ఉన్నారు. ఇక బ్రహ్మోత్సవాలు అంటే టీటీడీ అధికారులకు రెట్టింపు పని ఉంటుంది. దాంతో వారు వచ్చిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడం ఉత్సవాలు సక్సెస్ ఫుల్ గా జరిగేలా చూడడంతో బిజీగా ఉంటారు.

అందువల్ల మరో వైపు చూసే అవకాశం లేదు. బ్రహ్మొత్సవాలు ఈ నెల 12తో ముగుస్తాయి. ఈ లోగా సిట్ సభ్యుల నియామకం పూర్తి అయితే కొత్త సిట్ టీం ఈ నెల 12 తరువాత డ్యూటీ ఎక్కే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. సిట్ ఈ నెల మూడవ వారం తరువాతనే ఎంట్రీ ఇస్తుంది అని అంటున్నారు.

ఇక సుప్రీం కోర్టు ఆదేశాలు ఉండడం, అలాగే సీబీఐ పర్యవేక్షణ కూడా ఉండడంతో కొత్త సిట్ అన్ని అంశాలు సమగ్రంగా విచారిస్తుంది అని అంటున్నారు. అన్ని వైపుల నుంచి కూడా సిట్ విచారణ సాగే అవకాశం ఉంది. ఏ వైపు నుంచి కూడా ఏ చిన్న సమాచరం ఉన్నా కూడా వదిలిపెట్టకుండా సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతుంది అని అంటున్నారు.

ఇక కొత్త సిట్ లో సభ్యులు ఎవరు అన్నది సీబీఐ డైరెక్టర్ ఇద్దరిని అలాగే రాష్ట్ర డీజీపీ మరో ఇద్దరిని పేర్లు ఎంపిక చేస్తారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే కొత్త సిట్ ఏర్పాటుతో లడ్డూ వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లు అని అంటున్నారు. రాజకీయంగా దుమ్మెత్తిపోసుంటూ గత ఇరవై అయిదు రోజులుగా హోరెత్తిన ఏపీ రాజకీయ పార్టీలు నేతలు ఇపుడు ఆ అంశాన్ని పక్కన పెట్టినట్లుగానే ఉన్నారు.

సిట్ విచారణ జరిపి తొందరగా నివేదికను సిద్ధం చేసి సుప్రీంకోర్టుకు ఇస్తుందని అంటున్నారు. ఆ నివేదిక వచ్చిన తరువాతనే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధ్యుల మీద చర్యలు ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కొత్త సిట్ ఏపీకి వచ్చి తిరుమలలో విచారణ చేపడితే అపుడు మళ్లీ కొంత చర్చ సాగే అవకాశం ఉంది.

Tags:    

Similar News