"అప్పటివరకూ గాజాలో ఆకలి చావులు నైతికమే"... మంత్రి సంచలన వ్యాఖ్యలు!

హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై గత కొన్ని నెలలుగా ఇజ్రాయేల్ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-06 07:10 GMT

హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై గత కొన్ని నెలలుగా ఇజ్రాయేల్ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఇజ్రాయేల్ - హమాస్ మధ్య మొదలైన యుద్ధం కాస్తా గాజాలో తీవ్ర సంక్షోభానికి దారి తీసింది. అక్కడ ఇప్పటికే ఎన్నో ఆకలి చావులు నెలకొన్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఆ ఆకలి చావులు నైతికమైనవే అంటూ ఇజ్రాయేల్ ప్రధాని మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అవును... ఇజ్రాయేల్ – హమాస్ మధ్య గత కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధం కాస్తా గాజాలో పరిస్థితులను చెల్లాచెదురు చేసేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయని.. ఆకలి కేకలు హోరెత్తిపోతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో... ఇజ్రాయేల్ మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడి ప్రజల ఆకలి చావులు సమర్థనీయమే కావొచ్చని అన్నారు.

వాస్తవానికి ఇప్పటికే పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఓ పక్క ఇప్పటికే హమాస్ తో ఇజ్రాయేల్ యుద్ధం జరుగుతున్న వేల హమాస్ లోని కీలక నేతలతోపాటు హెజ్ బొల్లాల నేతలూ హత్యలు గావింపబడటంతో ఇజ్రాయేల్ పై దాడులు ఏ క్షణమైనా జరిగే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా గాజాపై ఇజ్రాయేల్ దాడులు కొనసాగిస్తోంది.

అసలు హమాస్ అనే పదమే వినిపించకుండా భూస్థాపితం చేస్తామంటూ కొన్ని నెలలుగా ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) అవిరామంగా దాడులు చేస్తోంది.. బాంబుల వర్షాలు కురిపిస్తోంది. దీంతో... గాజాకు ఆహార పదార్థాలు అందడం సంగతి దేవుడెరుగు ఆఖరికి తాగునీరు అందే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. అస్పత్రులు, తాగినీటి వ్యవస్థలు కూడా ఇజ్రాయేల్ దాటికి పూర్తిగా ధ్వంసమయ్యాయని అంటున్నారు.

ఇలా ఇజ్రాయేల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటివరకూ సుమారు 40వేల మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఇజ్రాయేల్ మంత్రి స్మోట్రిచ్... రెండు మిలియన్ల మంది ప్రజలు ఆకలితో మరణించేందుకు ప్రపంచం తమను అనుమతించదని.. తమను అడ్డుకుంటుందని చెబుతూ... తమ బందీలు తిరిగి వచ్చేవరకూ ఆ ఆకలి చావులు నైతికమైనవే అని ఘాటుగా స్పందించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి!

Tags:    

Similar News