"అనుపమ"లో కేంద్ర మాజీమంత్రి రీఎంట్రీ కన్ఫాం..!?

ఈ సమయంలో స్మృతి ఇరానీ గురించి ఓ ఆసక్తికర విషయం ప్రచారంలోకి వచ్చింది.

Update: 2024-10-15 04:12 GMT

రాజన్ షాహీ హిట్ టీవీ షో "అనుపమ" ప్రారంభించినప్పటి నుంచీ టీఆర్పీ రేటింగ్స్ లో ఆధిపత్యం చూపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... "అనుపమ"లోకి కొందరు కొత్త తారలు ఎంట్రీ ఇచ్చారు! ప్రతీ కొత్త ఎపిసోడ్ తో షో ప్రజలను అలరించింది. ఈ సమయంలో స్మృతి ఇరానీ గురించి ఓ ఆసక్తికర విషయం ప్రచారంలోకి వచ్చింది.

అవును... మాజీ కేంద్రమంత్రి, స్మృతి ఇరానీ మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇటీవల "అనుపమ" మేకర్ ప్రోమోను చూపించారు. ఈ ప్రదర్శనలో అనేక మార్పులు చెయబడ్డాయని తెలుస్తోంది! రూపాలీ గంగూలీ, అలీషా పర్వీన్, శివం ఖజురియా ఈ షోలో భాగం కానున్నారు!

ఈ నేపథ్యంలో... స్మృతి ఇరానీ కూడా "అనుపమ"లో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ మేరకు మీడియా కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా... "అనుపమ"లో చేయడానికి స్మృతి ఇరానీ సిద్ధంగా ఉందని.. అయితే ఆమె పాత్ర వివరాలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదని అంటున్నారు.

కాగా... స్మృతి ఇరానీ "క్యుంకీ సాస్ భీ కభీ బహు"లో తులసి విరానీ పాత్రతో టీవీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. 2000లో "ఆతీష్" అనే టీవీ సిరీస్ తో నటనా రంగ ప్రవేశం చేసిన స్మృతి ఇరానీ.. ఆ తర్వాత "హం హై కల్ ఆజ్ ఔర్ కల్"లో కనిపీంచారు. దీని తర్వాతే ఏక్తా కపూర్..స్మృతి ఇరానీ కి "క్యుంకీ సాస్ భీ కభీ బహు"లో ఆఫర్ ఇచ్చారు.

ఇక 2022లో "రామాయణం"లో నితీష్ భరద్వాజ్ సరసన సీత పాత్రను పోషించారు స్మృతి ఇరానీ. ఆ తర్వాత 2006లో "తోడి సీ జమీన్" అనే టీవీ షోకి సహ నిర్మాతగానూ పనిచేశారు. అనంతరం.. "విరుధ్" అనే టీవీ షోను నిర్మించి అందులో ప్రధానపాత్ర పోషించారు. 2008లో సాక్షి తన్వర్ తో కలిసి ఓ డ్యాన్స్ షోను హోస్ట్ చేశారు.

ఇదే క్రమంలో... 2009లో "మణిబెన్.కాం" అనే కాం అనే కామెడీ షోలోనూ కనిపించారు. ఆ తర్వాత ఆమె టీవీని వదిలి రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇందులో భాగంగా... భారతీయ జనతాపార్టీలో చేరారు. అయితే ఆమె తిరిగి "అనుపమ"లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు!

Tags:    

Similar News