టీటీడీ - టీడీపీ.. బాబు పట్టించుకోలేదు కానీ, రగడే.. !
సో.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. ఓ వర్గం మీడియాలోనూ ఇదే పెద్ద విమర్శలకు దారితీసింది. చంద్రబాబుపై విమర్శలు చేసేలా చేస్తోంది కూడా. అదే.. టీటీడీ బోర్డు ఏర్పాటు విషయం.
చంద్రబాబు సైలెంట్‌గా ఉన్న మాత్రాన.. విషయం విషయం కాకుండా పోదు! ఈ మాట ఎవరో అనడం కాదు.. సొంత పార్టీ సీనియర్ నాయకుడే ఒకరు విజయవాడలో వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు చేసిన వ్యక్తికంటే కూడా.. విషయం చాలా కీలకం. సో.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. ఓ వర్గం మీడియాలోనూ ఇదే పెద్ద విమర్శలకు దారితీసింది. చంద్రబాబుపై విమర్శలు చేసేలా చేస్తోంది కూడా. అదే.. టీటీడీ బోర్డు ఏర్పాటు విషయం.
ఈ బోర్డుపై పైకి వినిపించడం లేదని అనుకున్నా.. అంతర్గత చర్చలు, సోషల్ మీడియాలో మేధావులు చేస్తున్న వ్యాఖ్యలు వంటివి.. ఈ బోర్డును రాజకీయంగా ఇప్పుడు సెంటర్‌లో నిలబెట్టినట్టు అవుతోంది. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమల బోర్డును మలిచారంటూ.. అనేక మంది విమర్శలు చేస్తున్నా రు. గత వైసీపీ సర్కారు లెక్కకు మించి 54 మందితో బోర్డు ఏర్పాటు చేసింది. ఇది పెను వివాదాలకు విమర్శలకు కూడా తావిచ్చింది.
ఇప్పుడు లెక్క సరిపోయినా.. వాసి పరంగా చూసుకుంటే.. రాజకీయ నేతల ప్రాధాన్యం పెరిగిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి బోర్డును చూసినా అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది జరి గిన ఎన్నికల్లో టికెట్లు దక్కని వారికి బోర్డులో చోటు కల్పించడం అంటే.. రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని భావించడమేనన్న వ్యాఖ్యలకు లక్షల్లో వ్యూస్, లైకులు వస్తున్నాయంటే.. సైలెంట్‌గానే వారం తా.. ఈ విషయంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పైగా ఎండోమెంట్ విభాగంలోని సెక్షన్లను ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా ప్రయోగించడం కూడా.. ఆశ్చ ర్యం వేస్తోంది. మూడు సార్లకు మించి బోర్డులో సభ్యత్వం కల్పించేందుకు అవకాశం కల్పించని సెక్షన్లు ఉన్నాయి. అయినప్పటికీ.. ఇప్పుడు నాలుగోసారి కూడా అవకాశం కల్పిస్తున్నవారు ఉన్నారు. వీరు పొరు గు రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం. మరి వారికి అంతప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏంట నేది సర్కారుకే తెలియాలి.
మరోవైపు.. జనసేన నుంచి, బీజేపీ నుంచి కూడా నాయకులు బోర్డులో చోటు దక్కించుకున్నారు. సో.. ఇలా చూస్తే.. రాజకీయంగా టీటీడీ బోర్డు వివాదాలకు కేంద్రంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. గతంలో ఇలా చేశారనే వైసీపీని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు తమ్ముళ్లు!! ఈ విషయం గుర్తుండే ఉంటుంది. మరి బాబు సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన.. ప్రజల్లో పెరుగుతున్న ఈ భావన ప్రమాదం కాదా? అనేది ప్రశ్న. ఇప్పటికిప్పుడు బోర్డును వెనక్కి తీసుకోకపోవచ్చు. కానీ, ఈ రగడను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంటుంది.