బుడమేరు వాగులో టెక్కీ గల్లంతు... అసలేం జరిగింది..?

అవును... మచిలీపట్నంకు చెందిన ఫణికుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.

Update: 2024-09-08 09:02 GMT

ఏపీలో భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగుకి గండ్లు పడటం కారణంగా జరిగిన డ్యామేజ్ సంగతి తెలిసిందే. లక్షల మంది ఈ వరదల కారణంగా ప్రభావితులయ్యారు. పదుల సంఖ్యలో మృతి చెందగా.. లక్షల మంది బాధితులైన పరిస్థితి. ఈ సమయంలో తాజగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఈ వరద నీటిలో చిక్కుకుని గల్లంతైన విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... మచిలీపట్నంకు చెందిన ఫణికుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో వినాయక చవితి కావడంతో ఊరికి వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్లి, సాయంత్రం తిరిగి బందరుకి బయలుదేరాడట.

ఈ క్రమంలో అతడు కేసరపల్లి - ఉప్పులూరు - కంకిపాడు మీదుగా మచిలిపట్నం వెళ్లాలనుకోగా.. స్థానికులు మాత్రం అటుగా వెళ్లొద్దని, బుడమేరు వరద తీవ్రత ఇంకా ఉందని హెచ్చరించారట. అందువల్ల విజయవాడ నుంచి వెళ్లాలని సూచించారట. కానీ వారి మాటను ఫణికుమార్ పెడచెవిన పెట్టినట్లు చెబుతున్నారు.

కారణం ఏదైనా స్థానికులు చెప్పినట్లు విజయవాడ నుంచి కాకుండా.. తాను ఫిక్సైనట్లు కేసరపల్లి - ఉప్పులూరు - కంకిపాడు మీదుగానే బయలుదేరారట. ఈ క్రమంలోనే బుడమేరు వాగులో చిక్కుకుపోయాడని చెబుతున్నారు. ఈ పరిస్థితి గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని అంటున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందిచినా.. రాత్రి సమయం కావడంతో రెస్క్యూ చేయడానికి వీలు కాలేదని.. అయినప్పటికీ ఎన్.డీ.ఆర్.ఎఫ్. సిబ్బందికి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. అయితే... అప్పటికే ఫణికుమార్ కారు వరదలో కొట్టుకుపోయిందని.. ఇదే క్రమంలో ఫణికుమార్ కూడా ఆ వరద ఉదృతికి కొట్టుకుపోయారని అంటున్నారు.

ఈ సమయంలో ఆదివారం ఉదయం నుంచి ఫణికుమార్ కోసం ఎన్.డీ.ఆర్.ఎఫ్. సిబ్బంది గాలిస్తూనే ఉన్నారని అంటున్నారు. మరోపక్క పండక్కని ఇంటికి వచ్చిన వ్యక్తి ఇలా వరదలో గల్లంతవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News