సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కే ఢోకా.. 2వేలు కడితే 31 లక్షల మోసం

కానీ పార్ట్ టైం జాబ్ కోసం కక్కుర్తి పడి ఉన్నదంతా ఊడ్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

Update: 2024-03-15 09:30 GMT

ఆన్ లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. నిరక్షరాస్యులే కాదు చదువుకున్న వారు కూడా వాటికి బలవుతూనే ఉన్నారు. ఎన్ని జరిగినా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఫలితంగా రూ. లక్షలు పోగొట్టుకుంటున్నారు. చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. జరగాల్సిన నష్టం జరిగాక చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నట్లుగా ఉంటోంది. పోలీసులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు.

ఉన్నదాంట్లో సరిపెట్టుకోక అత్యాశకు పోవడం కొత్తేమీ కాదు. అతడో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. లక్షల్లోనే వేతనం ఉంటుంది. కానీ పార్ట్ టైం జాబ్ కోసం కక్కుర్తి పడి ఉన్నదంతా ఊడ్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తన దురాలోచన దుఖానికి చేటు తెచ్చింది. ఫలితంగా రూ. 31 లక్షలు పోయేందుకు కారణమయ్యాడు. తరువాత లబోదిబోమంటే ఏం లాభం? ముందే జాగ్రత్త పడాల్సింది.

అమీన్ పూర్ పురపాలక సంఘం పరిధిలోని నవ్యనగర్ కాలనీలో ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగికి గత నెల 26న ఆన్ లైన్ లో పార్ట్ టైం జాబ్ అంటూ వచ్చిన లింకును క్లిక్ చేశాడు. దీంతో ఇందులో టాస్కులు ఉన్నాయంటూ వాటిని పూర్తి చేయాలంటే రూ. 2 వేలు చెల్లించాలని చెప్పారు. దీంతో అతడు రూ. 2 వేలు కట్టాడు. దీంతో అవి సరిపోవు ఇంకా డబ్బులు కావాలంటూ అతడి నుంచి రూ. 31 లక్షలు లాగేశారు.

తీరా విషయం తెలిశాక నోరెళ్లబెట్టాడు. రూ.31 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలుసుకున్నాడు. పోలీసులను ఆశ్రయించాడు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదువురాని వారంటే మోసపోయారని అనుకోవచ్చు. కానీ అతడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయి ఉండి కూడా ఇలా మోసపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.31 లక్షలు పోయే వరకు కూడా అతడికి గుర్తుకు రాలేదా? మోసపోతున్నాననే విషయం తెలిలేదా? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇలాగే మోసపోవడం జరుగుతుంది. మోసపోయే వారున్నంత కాలం మోసం చేసే వారుంటారు. ఇలా డబ్బులు పోగొట్టుకోవడం మన తెలివితక్కువ తనానికే నిదర్శనమని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News