వీడియో: నేడు రోడ్లపై బిక్షాటన చేస్తోన్న టెకీ... గతమెంతో ఘనం!

ఈ విషయంలో రెండూ సమపాళ్లలో పనిచేస్తేనే అటు వారు ఇటు, ఇటు వారు అటు అవుతారని చెబుతుంటారు.

Update: 2024-11-25 12:30 GMT

ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో చెప్పడం ఎవరి వల్లా కాదని అంటుంటారు! అయితే ఒకప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు నేడు పతనావస్థలో ఉన్నా.. ఒకప్పుడు అత్యంత అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నవాళ్లు నేడు అత్యంత ఉన్నత స్థానాల్లో ఉన్నా దానికి రెండు కారణాలు ఉంటాయని అంటుంటారు. ఒకటి ఎవరికి వారు చేసుకునేది కాగా.. రెండోది పరిస్థితుల ప్రభావం (ప్రకృతి) అని చెబుతుంటారు.

ఈ విషయంలో రెండూ సమపాళ్లలో పనిచేస్తేనే అటు వారు ఇటు, ఇటు వారు అటు అవుతారని చెబుతుంటారు. సినిమా ఇండస్ట్రీలో అయితే... గుమ్మడి కాయ అంత టాలెంట్ తో పాటు ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలని అంటుంటారు. ఈ క్రమంలో స్వయంకృతాపరాధానికి తోడు ప్రకృతి సహాయనిరాకరణ కూడా తోడయ్యిందో ఏమో కానీ.. నిన్నటి సాఫ్ట్ వేర్ ఇంజినేర్ నేడు వీధులో బిక్షాటన చేసుకుని బ్రతుతున్న విషయం తెరపైకి వచ్చింది.

అవును... ఒకప్పుడు జర్మనీలోనూ, తర్వాత బెంగళూరులోను ప్రముఖ టెక్ కంపెనీలో పనిచేసిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. నేడు అదే బెంగళూరు జయనగర వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పరిస్థితికి కారణాలు ఒకటి తల్లి తండ్రులను, స్నేహితురాలిని కోల్పోవడం ఒకటి కాగా.. ఆ బాధలో మద్యానికి బానిసైపోవడం మరో కారణంగా చెబుతున్నారు.

తాజాగా ఓ యువకుడితో సదరు వ్యక్తి పంచుకున్న అనుభవాలకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి.. ధాన్యం, తత్వశాస్త్రం, సైన్స్ మొదలైన అంశాల గురించి అనర్గళంగా మాట్లాడుతున్నారు. తల్లితండ్రులను కోల్పోవడం తనను మద్యం మత్తులోకి నెట్టిందని.. ఫలితంగా పరిస్థితులు తలకిందులు అయ్యి.. ఈ గతి పట్టిందని చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా స్పందించిన సదరు యువకుడు.. తాను సాయం చేయడానికి ప్రయత్నిస్తే నిరాకరించాడని అన్నారు. దీంతో.. ఎన్జీవోలను సంప్రదించినా.. పోలీసుల ప్రమేయంతోనే అతనిని మార్చడం సాధ్యమవుతుందని డాక్టర్లు అంటున్నారని తెలిపారు! జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా.. ప్రయాణంలో ఇవన్నీ సహజం అనుకుని ముందుకు సాగాలని ఈ సందర్భంగా పలువురు స్పందిస్తున్నారు.

Tags:    

Similar News