మంత్రి పదవి మీద సోముకు మోజుందా ?

బీజేపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. కేంద్ర బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.;

Update: 2025-04-08 23:30 GMT
Somu Veerraju’s Political Clarity

బీజేపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. కేంద్ర బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఉంది. ఇదంతా సోము వీర్రాజు గురించే. మరి ఇంత సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఆయన సాధించింది ఏమిటి అంటే రెండు సార్లు ఎమ్మెల్యేగా మాత్రమే అని చెప్పాలి.

ఆయన ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు. ఇక ఎమ్మెల్సీగా ఉన్నా కూడా మంత్రి కూడా కాలేదు. మరి సోము వీర్రాజుకు మంత్రి పదవి మీద మోజు ఉందా ఆయన కూడా మినిస్టర్ అనిపించుకుని బుగ్గ కార్లలో తిరగాలని ఆశపడుతున్నారా అంటే దానికి ఆయన ఇచ్చిన జవాబు కూడా సంచలనగానే ఉంది.

తనకు మంత్రి పదవుల మీద ఆశ లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు. ఎమ్మెల్సీగా రెండవసారి ప్రమాణం చేసి తాజాగా రాజమండ్రి వచ్చిన సోము వీర్రాజుకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనకు జరిగిన అభినందన సభలో ఆయన ఉత్సాహంగా మాట్లాడారు. అదే సమయంలో తన మనసులోని భావాలను కూడా బయట పెట్టారు. చాలా మంది తనను మంత్రి కావాలని కోరుతున్నారని అయితే తనకు ఆ ఆశలు లేవని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

తాను కోరుకుంటే 2014లోనే మంత్రి అయ్యేవాడిని అని కూడా అన్నారు. ఒక ఈ జీవితానికి ఇది చాలు అని చెప్పేశారు. అంటే రెండవసారి ఎమ్మెల్సీగా ఆరేళ్ళు పూర్తి చేసి ఇక రెస్ట్ తీసుకోవడమే అన్నట్లుగా ఆయన చెప్పారన్న మాట.

ఇక బీజేపీకి 2014లో రెండు మంత్రి పదవులు ఇచ్చారు. వాటిలో ఒకటి కామినేని శ్రీనివాసరావుకు దక్కితే రెండవది గోదావరి జిల్లాకు చెందిన పైడికొండల మాణిక్యాలరావుకి దక్కింది. ఆ కోటాలో సోము వీర్రాజుకు రావాల్సింది అని కూడా అనుకున్నారు

ఇక ఇపుడు ఎమ్మెల్సీ అయ్యారు బీజేపీ కూడా రెండవ మంత్రి పదవి కోరుతోందని వార్తలు వస్తున్నాయి. ఒక మంత్రి పదవి రాయలసీమకు చెందిన సత్యకుమార్ యాదవ్ కి ఇచ్చారు రెండవ పదవి గోదావరి జిల్లాలకు దక్కుతుందని అది కూడా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పనిచేసిన సీనియర్ నేత సోము వీర్రాజుకే అని పార్టీలో వర్గాలు ఆయన అభిమానులు అంటున్నారు

మరి మంత్రి పదవి అంటే ఆశ లేనిది ఎవరికి అన్న చర్చ కూడా ఉంది. అయితే సోము మాత్రం తనకు మంత్రి పదవి వద్దు ఆశలు లేవు అని అంటున్నారు. కాంటే అవును అనిలే అన్నది రాజకీయాల్లో చెప్పుకోవాల్సిన మాట అలా చూస్తే కనుక సోము వీర్రాజుకు మంత్రి పదవి మీద ఆశలు ఉన్నాయా లేక నిజంగా లేదా లేక ఆయనకు ఇచ్చే చాన్స్ ఉందా లేక ఇంకా ఏమైనా ఉందా ఇదీ ప్రస్తుతం గోదావరి జిల్లాలో బీజేపీలో సాగుతున్న అతి పెద్ద చర్చట.

Tags:    

Similar News