సోము వీర్రాజుకు టిక్కెట్ ఫిక్స్... టీడీపీలో కొత్త రచ్చ!

ఈ లిస్ట్ లో ఇప్పటికే పలు నియోజకవర్గాలు ఉన్నాయని తెలుస్తుండగా... తాజాగా అనపర్తి కూడా తోడయ్యిందని అంటున్నారు.

Update: 2024-03-13 08:06 GMT

చివరాఖరికి ఏమవుతుందో తెలియదు కానీ... పొత్తులో భాగంగా గ్రౌండ్ లెవెల్ లో కొన్ని నియోజకవర్గంలో టీడీపీ - బీజేపీ - జనసేన నేతలు, క్యాడర్ మధ్య బొత్తిగా పొసగడం లేదని తెలుస్తుంది. పైగా... కార్యకర్తల అభిప్రాయాలు, నేతల బుజ్జగింపుల పనులు పూర్తవ్వకుండానే టిక్కెట్లు, నియోజకవర్గాలను ప్రకటించడం వల్ల కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఈ లిస్ట్ లో ఇప్పటికే పలు నియోజకవర్గాలు ఉన్నాయని తెలుస్తుండగా... తాజాగా అనపర్తి కూడా తోడయ్యిందని అంటున్నారు.

అవును... కూటమిలో భాగంగా 10 ఎమ్మెల్యేలు, 6 ఎంపీ టిక్కెట్లు దక్కించుకున్న బీజేపీ.. ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, పి.గన్నవరం నుంచి అయ్యాజీ వేమ పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో అనపర్తి టిక్కెట్ సోము వీర్రాజుకు కేటాయించారని తెలుస్తుంది.

దీంతో... అనపర్తిలో తమ్ముళ్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారని సమాచారం. వాస్తవానికి అనపర్తి నుంచి 2014లో టీడీపీ తరుపున పోటీ చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. ఇదే క్రమంలో 2019లో జగన్ వేవ్ లో ఓటమి పాలయ్యారు. అయితే 2024లో మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు.. ఈ మేరకు గడిచిన నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో పనులు చక్కబెట్టుకుంటున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు.

ఈ సమయంలో తన స్థానాన్ని బీజేపీకి కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయంపై రామకృష్ణారెడ్డి సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. అయితే... అనపర్తిలో వీర్రాజు అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అదే జరిగితే... అప్పుడు టీడీపీ కేడర్ ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.

కాగా... సీట్ల సర్దుబాటులో భాగంగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కేడర్ మధ్య సఖ్యత కొరవడుతుందని... ఈ విషయంలో అధినేతలు రంగంలోకి దిగి నేతలను, కేడర్ ను కాస్త కూల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తుంది.

Tags:    

Similar News