అధ్యక్షుడికి అసెంబ్లీ షాకిచ్చింది... ఫలితంగా పవర్ తగ్గింది!
అవును... తాజాగా జరిగిన ఓటింగ్ లో అధ్యక్షుడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇందులో భాగంగా... 204 - 85 ఓట్ల తేడాతో జాతీయ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.
దక్షిణ కొరియాలో ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఇటీవల ఇటీవల "ఎమర్జెన్సీ మార్షల్ లా" విధించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. మరోపక్క తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో తన ప్రకటనను ప్రెసిడెంట్ వెనక్కి తీసుకున్నారు.
అయినప్పటికీ ఆయన చర్యను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. అధ్యక్షుడు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల "మార్షల్ లా" ప్రకటనను వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకువచ్చాయి. ఈ తీర్మానాన్ని పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమొదించింది. అనంతరం.. మార్షల్ లా అమలు చట్ట విరుద్ధం అంటూ స్పీకర్ ప్రకటించారు.
మరోపక్క అధ్యక్షుడిపై విపక్ష నేత అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే... అధికార పీపుల్ పవర్ పార్టీ బాయ్ కాట్ చేయడంతో అధ్యక్షుడికి పదవీ గండం తప్పింది. ఈ సమయలో ఊపిరి పీల్చుకునేలోపు మరోసారి గట్టిదెబ్బ తగిలింది. ఇందులో భాగంగా.. ఓటింగ్ లో తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఓటింగ్ లో అధ్యక్షుడికి ఎదురుదెబ్బ తగిలింది!
అవును... తాజాగా జరిగిన ఓటింగ్ లో అధ్యక్షుడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇందులో భాగంగా... 204 - 85 ఓట్ల తేడాతో జాతీయ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. తజా పరిణామాలతో ఆయన పవర్ తగ్గనుందని.. ఆయన అధికారాలకు కోత పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
కాగా... ద. కొరియా నేషనల్ అసెంబ్లీలో 300 మంది సభ్యులు ఉన్నారు. ఈ సమయంలో యూన్ సుక్ యేల్ కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం 204 - 85 ఓట్ల తేడాతో ఆమోదం పొందడంతో.. ఈ తీర్మానానికి సంబంధించిన పత్రాలను న్యాయస్థానికి పంపుతారు. ఈ సమయంలో వాటిని పరిశీలించేందుకు కోర్టుకు 180 రోజుల గడువు ఉంటుంది.
ఈ లోగా అధ్యక్షుడి విషయంలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై నెక్స్ట్ ఎలక్షన్ ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో న్యాయస్థానం యూన్ సుక్ యోల్ ను పదవి నుంచి తొలగిస్తే.. 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలి. అంటే... ద.కొరియా ప్రెసిడెంట్ ఫ్యూచర్ ఇప్పుడు న్యాయస్థానంలో ఉందన్నమాట!