బిడ్డను కంటే నెలకు రూ.64 వేలు సాయం!

ఈ పథకమేదో బాగుందని సంతోషపడుతున్నారా అయితే ఇది మన దగ్గర కాదు దక్షిణ కొరియా దేశంలో మాత్రమే.

Update: 2024-03-26 00:30 GMT

పిల్లలను కంటే నెలకు రూ.64 వేలు ప్రోత్సాహక నగదు బహుమతి అందిస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. పిల్లలను కంటే ఖర్చు పెరుగుతుందని, అందుకే డబ్బులు సంపాదించిన తర్వాతే పిల్లలను కనడం మీద దృష్టిపెట్టాలన్న తల్లిదండ్రుల ఆలోచనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకం ప్రకటించింది. ఈ పథకమేదో బాగుందని సంతోషపడుతున్నారా అయితే ఇది మన దగ్గర కాదు దక్షిణ కొరియా దేశంలో మాత్రమే.

దేశంలో ప్రమాదకరంగా మారిన జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ దేశంలో అత్యంత కనిష్టంగా 2023 సంవత్సరంలో జననాల రేటు 0.72కు పడిపోయింది. జీవన వ్యయం పెరగడం, నాణ్యత తగ్గడంతో దంపతులు పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం వైపు మళ్లింది.

దేశంలో పిల్లలను కనే దంపతులకు ఒక్కో బిడ్డకు నెలకు రూ.64 వేల చొప్పున ఎనిమిదేళ్ల పాటు 61 లక్షలను అందిస్తామని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏటా రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చించనున్నది. ఈ మొత్తం అక్కడి ప్రభుత్వ బడ్జెట్ లో దాదాపు సగం కావడం విశేషం.

Tags:    

Similar News