స్పీకర్ కి ఎదురు గాలి...!?

ఇక తమ్మినేనిని తప్పించమని ఆయనకు సీటు ఇవ్వవద్దని వైసీపీ అధినాయకత్వాన్ని ఆముదాలవలస వైసీపీలో అసమ్మతి వర్గం గట్టిగా కోరుతూ వచ్చింది

Update: 2024-03-31 03:59 GMT

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం కి ఎదురు గాలి వీస్తోంది అని అంటున్నారు. సవ్వేలు అన్నీ కూడా ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాని చెబుతున్నాయి. ఇక తమ్మినేనిని తప్పించమని ఆయనకు సీటు ఇవ్వవద్దని వైసీపీ అధినాయకత్వాన్ని ఆముదాలవలస వైసీపీలో అసమ్మతి వర్గం గట్టిగా కోరుతూ వచ్చింది. కానీ చివరికి ఆయనకే టికెట్ ఇస్తూ హై కమాండ్ డెసిషన్ తీసుకుంది.

దీంతో చేసేది లేక అసమ్మతి వర్గీయులు అంతా రాజీనామాలు చేస్తున్నారు. సువ్వారి గాంధీ అని బలమైన నేత ఉన్నారు. ఆయన తమ్మినేనికి తప్పిస్తే తనకు టికెట్ వస్తుందని భావించారు. కానీ ఇపుడు ఆయన వైసీపీ హై కమాండ్ మీద మండిపోతూ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు చాలా మంది కీలక నేతలు రాజీనామా చేశారు.

వారంతా ఇప్పటికే జనంలో తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. సువ్వారి గాంధీ ఈసారి ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారు అని అంటున్నారు. తమ్మినేని సామాజిక వర్గానికే చెందిన గాంధీకి రెండు మండలాల్లో పలుకుబడి ఉంది. దాదాపుగా ఇరవై వేల దాకా ఓట్లను చీల్చే బలం బలగం ఆయనకు ఉన్నాయని అంటున్నారు.

ఈ పరిణామంతో తమ్మినేని వర్గం కలవరపడుతోంది. ఆయనను బుజ్జగించి దారికి తేవాల్సిన జిల్లా యంత్రాంగం కూడా మిన్నకుంటోంది. అదే విధంగా అధినాయకత్వం సైతం ఈ విషయాలను పట్టించుకోలేదు. అసలే వైసీపీలూఅ అంత ఐక్యంగా నిలబడితేనే టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద విజయం కష్టం అని అంటున్నారు. ఆయన గట్టిగానే ఢీ కొడుతున్నారు.

అయితే ఇపుడు అలా కాకుండా వైసీపీలోనే చీలిక రావడం బలమైన నేతలు పార్టీని వీడిపోవడంతో తమ్మినేనికి బిగ్ ట్రబుల్స్ స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. సంక్షేమాన్ని ఎంతవరకూ నమ్ముకున్నా ఆయన మండలాల్లో కీలక నేతల సహకారం కూడా ఉండాలని అంటున్నారు. తమ్మినేని ఈ విషయంలో అసమ్మతి నేతలను లైట్ తీసుకోవడం వారిని పట్టించుకోకపోవడం వల్ల కూడా వారు ఇపుడు ఏకు మేకుగా మారి ఏకంగా స్పీకర్ విజయవకాశాలనే దెబ్బ తీస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. అయితే అద్భుతం జరిగి ఆముదాలవలస వైసీపీ ఖాతాలోనే పడుతుంది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

Tags:    

Similar News