శ్రీరెడ్డిని క్షమించేసిన చంద్రబాబు, లోకేశ్?
విజయవాడకు చెందిన శ్రీరెడ్డి కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో వీడియోలు చేసేది.
యూట్యూబ్ స్టార్ శ్రీరెడ్డిని ప్రభుత్వం క్షమించేసింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల అండ చూసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై ఇష్టానుసారం నోరు పారేసుకున్న శ్రీరెడ్డి.. సోషల్ మీడియా అరెస్టుల తర్వాత క్షమాపణలు వేడుకుంది. తనది తప్పని ఒప్పుకుంటున్నానని, ఆడపిల్లగా మన్నించి వదిలేయమని వేడుకోవడంతో ప్రభుత్వ పెద్దలు క్షమించినట్లు చెబుతున్నారు. దీంతో ఆమెపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు.
విజయవాడకు చెందిన శ్రీరెడ్డి కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో వీడియోలు చేసేది. అయితే గత ప్రభుత్వంలోని కొందరు కీలక నేతల సహకారంతో అప్పటి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుంది. విషయం లేకపోయినా బూతులుతో రెచ్చిపోయేది. సభ్య సమాజం ఏమనుకుంటుంది అన్న విషయం గుర్తించకుండా ఇష్టం వచ్చినట్లు వీడియోలు చేయడంతో ఆమెపై రాష్ట్రంలో వివిధ పోలీసు స్టేషనలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆమెకు తన తప్పు తెలుసుకున్నారు. నారా లోకేశ్ అన్నా నమస్కారం.. నాది తప్పైపోయింది. ఆడపిల్లను భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయనంటూ సోషల్ మీడియా వేదికగానే వేడుకున్న శ్రీరెడ్డికి ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది.
దీంతో వివిధ పోలీసుస్టేషన్లలో నమోదైన ఆరు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని శ్రీరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కు ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. నిన్న ఆమెపై నమోదైన కేసులను హైకోర్టు విచారించగా, కొన్ని కేసులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సూచించింది. విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులో రూ.10 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. పోలీసులు కేసు నమోదుచేసిన తర్వాత శ్రీరెడ్డి ఎలాంటి పోస్టింగులు పెట్టకపోవడం కూడా ఆమెకు బెయిల్ రాడానికి ఉపయోగపడిందని అంటున్నారు.