శ్రీతేజ్ హెల్త్ బులిటెన్... గుడ్ న్యూస్ చెప్పిన వైద్యులు!

"పుష్ప-2" బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-24 03:33 GMT

"పుష్ప-2" బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు అప్ డేట్ ఇచ్చారు.

అవును... సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ ఎంట్రీతో పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా తీవ్ర తొక్కిసలాట జరిగిందని చెబుతున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని, కోలుకోవడానికి సమయం పడుతుందని సీపీ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో తాజాగా హెల్త్ బులిటెన్ విడుదలైంది. ఇందులో భాగంగా... ఈ సందర్భంగా... ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఆస్పత్రి వైద్యులు ఆక్సిజన్, వెంటిలేటర్ సహాయాన్ని పూర్తిగా తొలగించినట్లు ప్రకటించారు. ఇదే క్రమంలో... శ్రీతేజ్ శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుకుంటోందని తెలిపారు.

అదేవిధంగా... జ్వరం తగ్గుముఖం పట్టిందని.. తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతోందని.. ఇది శరీర రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందన్న సంకేతంగా భావించొచ్చని వైద్యులు ప్రకటించారు. ఇక ఆహారం విషయానికొస్తే.. ఇంకా పైపు ద్వారానే అందిస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన పోషకాలు అందిస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News