'పుష్ప-2' ఘటన... కిమ్స్ లో శ్రీతేజ్ పరిస్థితిపై లేటెస్ట్ అప్ డేట్!

ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమరుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.

Update: 2024-12-21 06:58 GMT

"పుష్ప-2" బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే! ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమరుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో అతడి హెల్త్ బులిటెన్ విడుదలైంది.

అవును... సుమారు రెండు వారాలకు పైగా హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం పరిస్థితిపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. బాలుడి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందంటూ హైదరాబాద్ సీపీ వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ సమయంలో తాజాగా శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ ను కిమ్స్ వైద్యులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా... సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతుందని.. కళ్లూ, చేతులూ కదిలిస్తున్నాడని.. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడని తెలిపారు! అప్పుడప్పుడూ ఫిట్స్ లాంటివి వస్తున్నాయని అన్నారు!

మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ను ఇటీవల హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని, రికవరీ అవ్వడానికి ఇంకా సమయం పడుతుందని.. అతని మెడికల్ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.

Tags:    

Similar News