ఇస్పెషల్: సెంచరీ ప్రయోగాల శ్రీహరికోట
సుమారు 2500 కేజీల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎఫ్15 రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.;
భారత అంతరిక్ష రంగం సాధించే ప్రతి విజయం వెనుక ఉండే ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ)కు కొండంత అండగా నిలుస్తోంది శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్. ఇందులోని రెండో ప్రయోగ వేదిక నుంచి మరో అంతరిక్ష ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈసారి ప్రయోగం స్పెషల్ ఏమంటే.. ఇది ఇక్కడి నుంచిప్రయోగించే వందో అంతరిక్ష ప్రయోగం. ఈ నెల 29న సాయంత్రం 6.23 గంటలకు నావిక్ 2 ఉపగ్రహాన్ని రోదశిలోకి పంపుతున్నారు.
సుమారు 2500 కేజీల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎఫ్15 రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ ప్రయోగంలో ఉపయోగించే శాటిలైట్ల విషయానికి వస్తే.. నావినేషన్ ఉపగ్రహాల సిరీస్ లో తొమ్మిదోది కాగా.. నావిక్ ఉపగ్రహాల సీరిస్ లో రెండోదిగా చెప్పొచ్చు. జీఎస్ఎల్ వీ రాకెట్ సిరీస్ లో 17వ ప్రయోగం. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొంచిందిన క్రయోజనిక్ దశలో 11వ ప్రయోగంగా దీన్ని చెప్పాలి.
ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నిర్మించిన తర్వాత తాజాగా నిర్వహించే ప్రయోగం వందోది. తాజా ప్రయోగంతో మన దేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే వీలు కలుగుతుంది. దీంతో.. వినియోగదారులు కచ్ఛితమైన స్థానం.. వేగం.. సమయసేవలను అందించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. 2023 మేల 29న నావిక్ 01 ఉపగ్రహానికి అనుసంధానంగా ఇప్పుడు రెండో ఉపగ్రహాన్ని పంపేందుకు రెఢీ అవుతున్నారు.
ఈ ప్రయోగంలోనే నావిక్ సిరీస్ లో మరో మూడు ఉపగ్రహాలను ఈ ఏడాదిలో ప్రయోగించనున్నారు. నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయటానికి ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిసట్టం 8 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు వీలుగా రెండో తరం నావిక్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తోంది.దీన్ని న్యూ జనరేషన్ శాటిలైట్ గా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఉప గ్రహంలో అణు గడియారాన్ని సైతం అమర్చారు.
ఈ శాటిలైట్ తో భూమి.. జల.. వాయు మార్గాల స్థితిగతులు.. దిక్కులు.. ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం.. వాహనదారులకు దిశా నిర్దేశం.. ఇంటర్నెట్ తోఅనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రయోగం కారణంగా భారత విమానయాన.. నౌకాయాన.. సైనిక అవసరాలకు ఈ ప్రయోగం ఎంతో సాయం చేయనుంది.