చీకట్లో శ్రీలంక.. విద్యుత్ సరఫరా ఎందుకు బంద్ అయ్యింది?
ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సమస్యలతోకిందా మీదా పడుతున్న శ్రీలంకకు కొత్త సమస్య వచ్చి పడింది. తాజాగా శ్రీలంక వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సమస్యలతోకిందా మీదా పడుతున్న శ్రీలంకకు కొత్త సమస్య వచ్చి పడింది. తాజాగా శ్రీలంక వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో.. అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాంకేతిక సమస్య తలెత్తటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు సరఫరా నిలిచిపోవటంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
ఈ మొత్తం సమస్యకు కారణం కాట్ మలే - బియగమా మధ్యనున్న ప్రధాన విద్యుత్ లైన్ లో సమస్య ఏర్పడటంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తింది. అయితే.. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న విషయానికి వస్తే.. విదేశీ మారక నిల్వలు కూడా తక్కువ కావటంతో ఇంధన రవాణాకు డబ్బులు చెల్లించట్లేదు. దీంతో.. కొద్దికాలంగా శ్రీలంకలో విద్యుత్ కోతలు సర్వసాధారణమయ్యాయి.
గడిచిన కొంతకాలంగా రోజుకు దాదాపు పది గంటల పాటు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో అక్కడి ప్రజలు ఆందోళకు గురవుతున్నారు. తాజా పరిణామాలతో దేశంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విద్యుత్ సరఫరా అంతరాయంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.