స్వామి లడ్డూ ఇక పరమ పవిత్రం...పునరుద్ధరించామన్న టీటీడీ
అంతే కాదు గత ప్రభుత్వ హయాంలో ఉపయోగించిన నేయి ప్రస్తుతం ఉపయోగించిన నేయి రెండింటి వివరాలను కూడా ఎక్స్ లో పెట్టిన పోస్టులో వెల్లడించింది.
గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని శ్రీవారి భక్తులను ఆవేదనకు గురి చేసిన స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్న వార్తలకు కాస్తా ఉపశమనం కలిగించేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కీలక ప్రకటన చేసింది. స్వామి వారి లడ్డూ లడ్డూ అపవిత్రం అన్న అనుమానాలతో పాటు భక్తులలో చెలరేగుతున్న ఆవేదనను దృష్టిలో ఉంచుకుని ఎక్స్ వేదికగా టీటీడీ పోస్ట్ చేసింది.
దాని ప్రకారం చూస్తే శ్రీవారి లడ్డూ ప్రసాదాల పవిత్రతను పునరుద్ధరించామని పేర్కొంది. అంతే కాదు గత ప్రభుత్వ హయాంలో ఉపయోగించిన నేయి ప్రస్తుతం ఉపయోగించిన నేయి రెండింటి వివరాలను కూడా ఎక్స్ లో పెట్టిన పోస్టులో వెల్లడించింది.
నెయ్యి కల్తీని నిర్ధారించిన ల్యాబ్ రిపోర్టుని కూడా టీటీడీ ఎక్స్ పోస్టులఒ పేర్కొంది. నందిని డెయిరీ నెయ్యి ల్యాబ్ రిపోర్టుని కూడా పోస్టు చేసింది. దాంతో లడ్డూ నాణ్యత మీద భక్తులలో ఉన్న అపోహలు తోల్గించేందుకు గట్టిగానే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది.
ఇక గతంలో వాడిన నెయ్యిలో ఎస్ వాల్యూ వందకు 19 పాయింట్లు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాడిన నెయ్యిలో ఎస్ వాల్యూ వందకు 97 పాయింట్లు ఉండడం విశేషం. మొత్తానికి లడ్డూ తయారీకి మేలైన నెయ్యి వాడుతున్నామని టీటీడీ స్పష్టం చేసినిద్. దంతో భత్కులు ఏ విధంగా రియాక్టు అవుతారో చూడాల్సి ఉంది.