మైండ్ బ్లాక్ చేస్తున్న OG గర్ల్
తాజాగా 'హూ ఈజ్ క్రియేటివ్ నౌ' 2024 జాబితాలో శ్రీయా పేరు వినిపిస్తోంది. ప్రఖ్యాత ది వర్డ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం శ్రీయా రెడ్డి ఫోటోషూట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
టాలీవుడ్ కోలీవుడ్ లో వరుసగా విలక్షణ పాత్రల్లో నటిస్తూ మతులు చెడగొడుతోంది శ్రీయా రెడ్డి. ఈ బ్యూటీ ఎంపికలు ప్రతిదీ యూనిక్. భరత్చంద్రన్ I.P.S (2005)లో శ్రీయారెడ్డి నటనకు గొప్ప గుర్తింపు దక్కింది. మేటి కథానాయిక, రాజకీయ నాయకురాలు విజయశాంతి పాత్రతో పోల్చారు. తమిళంలో విడుదలైన 'వెయిల్' (2006) శ్రీయాకు జాతీయ చలనచిత్ర అవార్డును అంతించింది. అలాగే ఈ పాత్రకు రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి.
'తిమిరు' 2006లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇందులో శ్రీయారెడ్డి ఇంటెన్స్ పాత్రకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత కాంచీవరం (2008)లో నటనకు జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. ఈ సంవత్సరం 'తలైమై సేయలగం' (2024) .. 'సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్' (2023) ..సుజల్: ది వోర్టెక్స్ (2022) శ్రీయా స్థాయి అమాంతం పెరిగింది.
శ్రీయా రెడ్డి సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా 'హూ ఈజ్ క్రియేటివ్ నౌ' 2024 జాబితాలో శ్రీయా పేరు వినిపిస్తోంది. ప్రఖ్యాత ది వర్డ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం శ్రీయా రెడ్డి ఫోటోషూట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ కొత్త లుక్ అంతర్జాలంలో సునామీలా మారింది. ది వర్డ్ ఇంటర్వ్యూలో శ్రీయా చెప్పిన సంగతులు ఆసక్తిని రేకెత్తించాయి.
''తాను చిన్నప్పటి నుంచి అథ్లెట్‌గా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. విజయం కోసం చాలా కష్టపడి పనిచేయాలని నిశ్చయించుకున్నాను'' అని శ్రీయ తెలిపారు. నాకు ఏదీ అసాధ్యం కాదు అని కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేసారు. స్టైల్ అనేది శ్రీయా వ్యక్తిగత ఇన్ బిల్ట్ లక్షణం. దీని గురించి ప్రశ్నించగా.. నేను మా అమ్మమ్మ, అమ్మ నుండి ప్రేరణ పొందాను. నా ఇంటిని దాటి, నేను రేఖ జీ, ఇందిరా గాంధీలా అందంగా కనిపించాలని, దయ పరంగా స్మితా పాటిల్ తరహా సరళత వైపు మొగ్గు చూపుతాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత తన అందమైన చీరలను ఎలాంటి మేకప్ - గ్రేస్ లేకుండా ధరించడం నాకు ఎప్పుడూ నచ్చుతుంది'' అని అన్నారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే శ్రీయా రెడ్డి ప్రస్తుతం తెలుగు యాక్షన్-థ్రిల్లర్ 'దే కాల్ హిమ్ OG'లో కనిపిస్తుంది. ఓజీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. సాహో ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.