'హిందీ మాతోత్సవాల రగడ'... మోడీకి స్టాలిన్ కీలక లేఖ!
అవును... చెన్నై దూరదర్శన్ స్వర్ణోత్సవాలను హిందీ మాస వేడుకలతో కలపవద్దని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు.
భారత రాజ్యాంగం దేశంలోని ఏ భాషకూ జాతీయ భాష హోదా కల్పించలేదు.. హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ భాషా మాసోత్సవాలు జరుపుకోవడం అంటే భాషా వైవిధ్యంపై ఆందోళనలు లేవనెత్తడమే అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. లేఖ రాశారు. దీంతో.. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దుతున్నారనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది!
అవును... చెన్నై దూరదర్శన్ స్వర్ణోత్సవాలను హిందీ మాస వేడుకలతో కలపవద్దని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇందులో భాగంగా... భారతదేశ భాషా వైవిధ్యాన్ని గుర్తించి సంబరాలు చేసుకోవాల్సిన అవసరాన్ని స్టాలిన్ ప్రధానికి రాసిన లేఖలో నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా ఎక్స్ లో స్పందించిన సీఎం స్టాలిన్... చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలతో పాటు హిందీ మాసోత్సవ వేడుకలను జరుపుకోవడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా... ‘గౌరవనీయులైన పీఎం మోడీ..’ అని మొదలుపెట్టిన ఆయన... భారత రాజ్యాంగం ఏ భాషకూ జాతీయ భాష హోదా ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు.
ఇదే సమయంలో... బహుభాషా దేశంలో.. హిందీయేతర రాష్ట్రాలలో హిందీ మాసోత్సవాన్ని జరుపుకోవడం అంటే.. ఇతర భాషలను కించపరిచే ప్రయత్నంగా పరిగణించబడుతుంది అని అభిప్రాయపడ్డారు. అందువల్ల.. హిందీయేతర రాష్ట్రాలలో ఇటువంటి హిందీ ఆధారిత కార్యక్రమాలు నిర్వహించడాన్ని నివారించాలని సూచించారు.
ఇదే క్రమంలో.. ఆ కార్యక్రమానికి బదులుగా ఆయా రాష్ట్రాల స్థానిక భాషా మాసోత్సవాలను ప్రోత్సహించాలని తాను సూచిస్తున్నట్లు మోడీకి రాసిన లేఖలో తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.