5.4 ల‌క్ష‌ల కోట్లు.. రుణ ప్ర‌ణాళిక విడుద‌ల చేసిన చంద్ర‌బాబు!

తాజాగా సచివాలయంలో 227వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది.

Update: 2024-07-09 17:21 GMT

ఏపీ ఆర్థిక అవ‌స‌రాలు, వివిధ శాఖ పురోగ‌మ‌నానికి సంబంధించి ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో మిగిలిన మూడు త్రైమాసికాల‌కు చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం 5.4 ల‌క్ష‌ల కోట్ల‌ను అప్పుగా స‌మీక‌రించ‌నుంది. ఈ మొత్తాన్ని కేంద్రంతో సంబంధం లేకుండా బ్యాంకులు ఇచ్చేలా చంద్ర‌బాబురుణ ప్ర‌ణాళిక‌ల‌ను రెడీ చేసుకున్నారు. తాజాగా సచివాలయంలో 227వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రుణ ప్రణాళికను విడుదల చేశారు. మొత్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేశారు.

ఏయే రంగాల‌కు ఎంతెంత రుణం?

+ ప్రాధాన్య రంగాలైన విద్యుత్‌, ర‌హ‌దారులు, మౌలిక స‌దుపాయాల‌కు రూ.3,75,000 కోట్లు కేటాయించారు.

+ ఇత‌ర రంగాల‌కు రూ.1,65,000 కోట్లు కేటాయిస్తూ ప్రణాళిక రూపొందించారు.

+ వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు తీసుకోవాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు.

+ ఈ మొత్తం రుణాలు గతం కంటే 14 శాతం అధికంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

+ డైరీ, ఫౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌలిక సదుపాయాలకు రూ.32,600 కోట్లను కేటాయిస్తారు.

+ 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతా రంగానికి రూ.3,23,000 కోట్లు రుణంగా తీసుకున్నారు.

+ ప్ర‌స్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.375,000 కోట్లు రుణ ప్రణాళికా లక్ష్యంగా పెట్టుకున్నారు.

+ గతంతో పోల్చితే 16 శాతం అధికంగా ఉంది.

+ వ్యవసాయ రంగానికి గత సంవత్సరం రూ.2,31,000 కోట్లు రుణ లక్ష్యం పెట్టుకోగా అందులో 90 శాతం(రూ.2,08,136 కోట్లు) రుణాలు మంజూరు అయ్యాయి.

+ ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహద పడే చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల రంగానికి 2023-24 ఏడాదిలో రూ.69,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది ఏకంగా రూ.87,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.

+ 26 శాతం అధికంగా రుణాలు తీసుకోవాల‌ని ప్రణాళిక రూపొందించారు.

+ గృహ నిర్మాణానికి రూ.11,500 కోట్లు రుణాలు తెచ్చేలా ప్రణాళిక చేశారు.

+ సాంప్రదాయేతర ఇంథన సెక్టార్ కు(విద్యుత్‌) రూ. 8000 కోట్లు రుణ ప్రాణాళిక ను సిద్దం చేశారు.

+ 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటు చేయ‌నుంది.

+ స్కిల్ డవల్మెంట్ కు చర్యలు తీసుకోవడంతో పాటు సంపద సృష్టించే, జిఎస్ డిపి పెంచే రంగాలకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు.

+ ఈ వ్య‌వ‌హారంలో బ్యాంక‌ర్ల క‌మిటీని నియ‌మించ‌నున్నారు.

Tags:    

Similar News