ఆదివారం అర్థరాత్రి వెళ్లిపోయిన స్టెల్లా షిప్.. చివరకు తేలింది ఇదే!

ఎట్టకేలకు ఈ నెల ఐదో తేదీ (ఆదివారం) అర్థరాత్రి వేళలో కాకినాడ పోర్టు నుంచి వెళ్లిపోయింది.

Update: 2025-01-07 04:57 GMT

సీజ్ ద షిప్ అంటూ కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ ను ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఆదేశంతో.. సదరు షిప్ కాకినాడ పోర్టులోనే నిలిచిపోయింది. ఎట్టకేలకు ఈ నెల ఐదో తేదీ (ఆదివారం) అర్థరాత్రి వేళలో కాకినాడ పోర్టు నుంచి వెళ్లిపోయింది. అది కూడా 52 వేల మెట్రిక్ టన్నుల బియ్యంతో. పశ్చిమ ఆఫ్రికాకు బయలుదేరిన షిప్ తో.. ఒక ఘట్టం ముగిసినట్లైంది.

పేద ప్రజలకు అందించాల్సిన పీడీఎస్ బియ్యం అక్రమంగా కాకినాడ పోర్టుకు రావటం.. అక్కడి నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా తరలి వెళ్లే సమాచారాన్ని అందుకున్న డిప్యూటీ సీఎం పవన్..కాకినాడ పోర్టుకు చేరుకొని తనిఖీలు చేసి.. ఆ కుట్రను బయటపెట్టారు. ఈ క్రమంలో షిప్ ను సీజ్ చేయాలని ఆదేశించారు. కేంద్రం అధీనంలో నడిచే పోర్టులో.. షిప్ ను ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఎలా ఆదేశిస్తారన్న ప్రశ్న పలువురి సంధించారు. అయినప్పటికీ.. డిప్యూటీ సీఎం పవర్ ఎంతన్న విషయం తెలిసేలా.. షిప్ పోర్టులోనే నిలిచిపోయింది.

చివరకు ఈ ఇష్యూకు సంబంధించిన పలు పరిణామాలు చోటు చేసుకున్న అనంతరం.. 38 రోజుల పాటు సదరు షిప్ పోర్టులోనే ఉండిపోయింది. స్టెల్లా నౌకలో 52 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉంటే అందులో మూడో నెంబరులో సత్యం బాలాజీ ఎక్స్ పోర్ట్ ఇండస్ట్రీకి చెందిన 1320 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యంగా లెక్క తేల్చారు. నౌకనుసీజ్ చేసిన నేపత్యంలో నవంబరు 29నుంచి డెమరేజ్ చెల్లించాలని నౌక యాజమాన్యం అంటున్న సమయంలోనే తుపాను కారణంగా డిసెంబరు 4 వరకు డెమరేజ్ వేయొద్దని ఎగుమతిదారులు పేర్కొన్నారు. ఈ వివాదం ఒక కొలిక్కి రాలేదు.

పోర్టులో నౌక నిలిచిపోయిన 38 రోజులకు సుమారు రూ.7 కోట్లకు పైనే డెమరేజ్ పడుతుందని లెక్క కట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఎగుమతి చేసే ప్రయత్నం చేసిన పీడీఎస్ బియ్యం విలువను మార్కెట్ రేటుతో లెక్క కడితే.. బియ్యం విలువ రూ.5.5 కోట్లు కాగా.. డెమరేజ్ రూపంలో చెల్లించాల్సింది రూ.7 కోట్ల వరకు కావటం గమనార్హం. మొత్తంగా.. అక్రమ పద్దతిలో బియ్యాన్ని ఎగుమతి చేసే ప్రయత్నం చేసిన సత్యం బాలాజీకి భారీ దెబ్బ తగిలినట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News