భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ వెయ్యి ప్లస్ కు ఎలా?

ఇన్ఫోసిస్.. మహీంద్రా.. బజాజ్ ఫైనాన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.

Update: 2025-01-02 10:11 GMT

ఇటీవల కాలంలో నేలచూపులు ఎక్కువగా చూస్తున్న స్టాక్ మార్కెట్ల సూచీల తీరుతో నిరాశాపూరిత వాతావరణం నెలకొంది. అప్పుడప్పుడు సూచీలు పరుగులు తీస్తున్నా.. గతంలో ఉన్న కళ కనిపించని పరిస్థితి. ఇలాంటి వేళ.. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన రెండో రోజున సూచీలు దౌడు తీస్తున్న వేగానికి ఇప్పుడు సూచీలు వేగంగా ముందుకు వెళుతున్నాయి. ఈ రోజున (జనవరి 2న) ట్రేడింగ్ ఆరంభమైనప్పటి నుంచి బీఎస్ఈ.. సెన్సెక్స్ వెయ్యి ప్లస్ పాయింట్లు దాటేసి.. లాభాల్లో ట్రేడ్ అవుతున్న వైనం ఆసక్తికరంగా మారింది.

ఈ జోరుతో నిఫ్టీ 24 వేల మార్కును దాటేసింది. ముఖ్యంగా ఆటో.. ఐటీ.. స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణిస్తున్నాయి. ఇన్ఫోసిస్.. మహీంద్రా.. బజాజ్ ఫైనాన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. ఈ మధ్యాహ్నం 12.50 గంటలకు సెన్సెన్స్ 1013.66 పాయిట్ల లాభంతో 79,530 పాయిట్ల వద్ద.. నిఫ్టీ 307 పాయింట్ల లాభంతో 24,050 వద్ద లాభాల్లో సాగుతున్నాయి. తాజా జోరుతో మదుపరుల సొమ్ము మార్కెట్ విలువ రూ.2 లక్షల కోట్లకు పెరిగింది.

సూచీల జోరుకు కారణాల్ని చూస్తే.. డిసెంబరు నెలకు సంబంధించి వెలువడిన టోకు వాహన విక్రయ గణాంకాలు మదుపర్లను మెప్పించాయి. సాధారణంగా డిసెంబరులో అమ్మకాలు తక్కువగా ఉంటాయి. అందుకు భిన్నంగా విక్రయాలు జరగటం పాజిటివ్ సెంటిమెంట్ కు కారణమైంది.

ముఖ్యంగా ఐషర్ మోటార్స్ 25 శాతం వార్షిక వ్రద్ధిని నమోదు చేయగా.. మారుతీ సుజుకీ 30 శాతం వ్రద్ధిని కనబరిచింది. దీంతో ఆయా కంపెనీల షేర్లు రాణిస్తున్నాయి. డిసెంబరు త్రైమాసికంతో పాటు 2025లోనూ ఐటీ కంపెనీల మెరుగైన రెవెన్యూ వ్రద్ధిని కనిపించే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్ ను సానుకూలంగా నడిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికి సెన్సెక్స్ 79,718 పాయింట్లతో.. నిఫ్టీ 24,112 పాయింట్లతో సానుకూల వాతావరణంలో ట్రేడ్ అవుతోంది.

Tags:    

Similar News