టీడీపీ గెలుస్తుందన్న అంచనాలతో.. మూడు రెట్లు పెరిగిన స్టాక్స్!
కానీ, జాతీయ స్థాయిలో నమ్మదగిన సర్వేలు మాత్రం కూటమివైపు నిలబడ్డాయి.
ఏపీలో ఎవరిది అధికారం అనేది అధికారికంగా జూన్ 4న వెల్లడి కానుంది. అయితే.. ఈలోగా వచ్చిన అనేక ఎగ్జిట్ పోల్స్‌లో టీడీపీ కూటమి విజయం దక్కించుకుంటుందని తేల్చిచెప్పాయి. అయితే.. మరికొన్ని మాత్రం వైసీపీ విజయం సాధిస్తుందని తెలిపాయి. కానీ, జాతీయ స్థాయిలో నమ్మదగిన సర్వేలు మాత్రం కూటమివైపు నిలబడ్డాయి. దీంతో మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి.
వాస్తవానికిఈ ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ జగన్ మనుటయా.. మరణించుటయా? అన్నట్టుగా సాగాయి. ఇక, ఎన్నికల ప్రచారం కూడా.. జోరుగా సాగించారు. దీనికితోడు ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తున్నారనే విషయంపై సర్వత్రా నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఇంత తీవ్ర పోరులోనూ.. జాతీయ మీడియా సంస్థలు సహా .. కొన్ని సర్వేలు.. కూటమి వైపు నిలబడ్డాయి. దీనిని ఎక్కువ మంది పెట్టుబడి దారులు విశ్వసిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఏపీ సహా ఇతర ప్రాంతాలకు చెందిన పెట్టుబడి దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నమ్మకంగా కూడా ఉన్నారు. దీంతో మార్పెట్ మూడు రెట్లు పుంజుకుంది. ముఖ్యంగా చంద్ర బాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ మరింత పుంజుకుంది. మార్చి 2023లో ఉన్న రూ.137 నుంచి రూ.150 మధ్య స్టాక్స్ అనూహ్యంగా మూడు రెట్లు పెరిగింది. కేవలం 14 మాసాల్లోనే మూడు రెట్లు పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఇది రూ.425 వద్ద ఉండడం గమనార్హం.
ఈ పరిణామాలను గమనిస్తే.. టీడీపీ గెలుస్తుందన్న అంచనాలు భారీగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. కొన్ని నెలల కిందట.. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో అరెస్టయిన విషయం తెలిసిందే. దీంతో పాటు అనేక కేసులు కూడా ఆయనపై నమోదయ్యాయి. అయితే.. వీటన్నింటినీ తోసిపుచ్చి.. ఇప్పుడు.. టీడీపీ విజయం దక్కించుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో హెరిటేజ్ మూడు రెట్లు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుండడం గమనార్హం.