ప్రపంచాన్ని గడగడలాడించిన ఏడు తుఫాన్లు ఏంటో తెలుసా?
ప్రపంచాన్ని గడగడలాడించిన తుఫాన్లు ఉన్నాయి. వాటి గురించి చెబితే మనకు భయం వేస్తుంది. అంతటి ఉత్పాతాన్ని కలిగించిన తుఫాన్లు ఎన్నో ఉన్నాయి.
ప్రపంచాన్ని గడగడలాడించిన తుఫాన్లు ఉన్నాయి. వాటి గురించి చెబితే మనకు భయం వేస్తుంది. అంతటి ఉత్పాతాన్ని కలిగించిన తుఫాన్లు ఎన్నో ఉన్నాయి. వాటితో ప్రజల ప్రాణాలు కోల్పోయారు. అవి కలిగించిన ఉపద్రవం గురించి తలుచుకుంటేనే భయం కలుగుతుంది. మన మనుగడకే ప్రమాదం కలిగించిన తుఫాన్ల గురించి తెలుసుకుంటే కంగారు పుట్టడం ఖాయం.
మన దేశంలో భయోత్పాతం కలిగించిన తుఫాన్లలో గ్రేట్ భోళా సైక్లోన్ ఒకటి. బంగ్లాదేశ్ లో పుట్టిన తుఫాన్ వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 3 నుంచి 5 లక్షల మంది ప్రజలను పొట్టన పెట్టుకుంది. దీంతో దేశం తీవ్రంగా నష్టపోయింది. ఇది 1970లో వచ్చిన తుఫాన్. దీని వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి.
1737లో వచ్చిన హుగ్లీ రివర్ తుఫాన్ వల్ల కూడా చాలా నష్టం సంభవించింది. దాదాపు 3.5 లక్షల మంది చనిపోయారు. ఇది భారత్, బంగ్లాదేశ్ దేశాల్లో తీవ్ర ప్రభావం చూపింది. 1881లో వియత్నాంలో వచ్చిన తుఫాన్ హైఫాంగ్ టైఫూన్. దీని వల్ల 3 లక్షలమంది చనిపోయారు. భారత్ లో 1939లో వచ్చిన కోరింగా తుఫాన్ వల్ల 3 లక్షల మందిని బలితీసుకుంది.
1584లో వచ్చిన బాకర్ గంజ్ తుఫాన్ విలయం కలిగించింది. బంగ్లాదేశ్ లో ఇది కలిగించిన విలయం గురించి ఎంత చెప్పిన తక్కువే. 2 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. 1876లో బంగ్లాదేశ్ ను గజగజ వణికించిన తుఫాన్ గ్రేట్ బ్యాకర్. దీని కారణంగా 2 లక్షల మంది బంగ్లాదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. తుఫాన్ల కారణంగా లక్షలాది మంది దూరం కావడం గమనార్హం.
1897లో మరో భయంకరమైన తుఫాన్ చిట్టగ్యాంగ్ సైక్లోన్. 1.45 మంది ప్రాణాలు బలితీసుకుంది. 10 లక్షల మందిని నిరాశ్రయులను చేసింది. చాలా నష్టం కలిగించింది. ఈ తుఫాన్ల వల్ల ఎంతో మంది బాధితులయ్యారు. ఇలా తుఫాన్ల ప్రభావంతో చాలా మంది కష్టాలకు గురి చేశాయి. ఇప్పుడు వచ్చిన బాగ్ జామ్ తుఫాన్ వల్ల కూడా చాలా వరకు పంటలు దెబ్బతినడం తెలిసిందే.