బిడ్డకు జన్మనిచ్చిన హాస్టల్ విద్యార్థిని? మోసం చేసింది ఎవరంటే..

శనివారం ఆకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో తోటి విద్యార్థినులు ఆమెను ఆస్ర్పత్రికి తరలించి సుఖ ప్రసవమయ్యేలా చూశారు. ఈ సంచలన సంఘటన ఏపీ నడిబొడ్డున ఉన్న గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Update: 2024-12-22 07:07 GMT

రోజూ కాలేజీకి వెళ్తున్న విద్యార్థిని డిసెంబర్ 21 శనివారం ఓ ఆడబిడ్డకు జన్మినించింది. నవ మాసాలు తన కడుపులో బిడ్డ పెరుగుతున్నట్లు ఎవరికీ చెప్పని ఆ విద్యార్థిని నమ్మిన వాడి చేతిలో మోసపోయింది. శనివారం ఆకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో తోటి విద్యార్థినులు ఆమెను ఆస్ర్పత్రికి తరలించి సుఖ ప్రసవమయ్యేలా చూశారు. ఈ సంచలన సంఘటన ఏపీ నడిబొడ్డున ఉన్న గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

గుంటూరు నగరంలోని జిల్లా జిల్లా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసుకు సమీపంలో ఉన్న ఓ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఘోరం జరిగింది. బీ.ఫార్మశీ చదువుతూ ఇంటికి దూరంగా ఉంటున్న ఓ విద్యార్థిని పెళ్లికాకుండానే తల్లి అయింది. ఆమె గర్భంతో ఉన్నప్పటికీ ఇటు హాస్టల్ వార్డెన్లు, అటు తల్లిదండ్రులు గుర్తించకపోవడమే ఇక్కడి విశేషం. నవమాసాలు బిడ్డను కడుపులో దాచుకున్న ఆ విద్యార్థిని ఇన్నాళ్లు తను గర్భంతో ఉన్నట్లు గుట్టుగా దాచింది. కానీ, ప్రసవ సమయం వచ్చినప్పుడు పురిటి నొప్పులు భరించలేకపోయింది. హాస్టల్లో ఉండగా నొప్పులు ఎక్కువ రావడంతో తోటి విద్యార్థినులు వెంటనే హాస్టల్ సిబ్బందికి సమాచారం చేరవేశారు. వారు హుటాహుటిన గుంటూరు జీజీహెచ్ కు తరలించగా, ఆ విద్యార్థిని ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. విద్యార్థినికి ప్రస్తుతం 19 ఏళ్ల వయసు. విద్యార్థిని ప్రసవించిందని తెలియగానే అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. జిల్లా యంత్రాంగం వెంటనే పరుగులు తీసింది. ఈ ఘోరం ఎలా జరిగిందని ఆరా తీసింది. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారమిచ్చి ఆస్పత్రికి రప్పించారు అధికారులు.

ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన విద్యార్థిని గుంటూరు నగరంలోని చిలకలూరిపేట రోడ్డులో ఉన్న పరివర్తన హాస్టల్లో ఉంటూ బీ.ఫార్మశీ చదువుకుంటుంది. ఆమె సొంతూరుకి చెందిన సమీప బంధువు వినోద్ ను ప్రేమించింది. ఇద్దరూ ఇష్టపడటంతో శారీరకంగా దగ్గరయ్యారు. సెలవులకు ఊరెళ్లినప్పుడు ఇద్దరూ కలిసేవారట. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం ప్రియుడికి చెప్పి తనను వివాహం చేసుకోవాలని కోరింది. అంతవరకు ప్రేమ పేరుతో నాటకమాడి ఆమెను వంచిన ప్రియుడు వినోద్, ప్రియురాలు గర్భం దాల్చిందని తెలుసుకుని మాట మార్చాడు. అయితే ఎప్పటికైనా వినోద్ మనసు మారుతుందని భావించిన విద్యార్థిని తన కడుపులో శిశువు పెరుగుతున్న విషయాన్ని రహస్యంగా దాచింది. శనివారం ప్రసవించిన తర్వాత తల్లిదండ్రులు సమక్షంలో అధికారులు ఆరా తీయగా, జరిగిన ఉదంతాన్ని వివరించింది. వినోద్ తమకు దగ్గర బంధువు కావడంతో విద్యార్థిని తల్లిదండ్రులు తొలుత కేసు పెట్టేందుకు వెనక్కి తగ్గారు. జరిగిందే జరిగిందని, తమ బిడ్డను వివాహం చేసుకోవాలని కోరారు. అయితే వినోద్, అతడి తల్లిదండ్రులు విద్యార్థిని తల్లిదండ్రుల ప్రతిపాదనను తిరస్కరించడంతో గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వినోద్ కేసు గాలింపు మొదలుపెట్టారు.

Tags:    

Similar News