బాబు ఢిల్లీ టూర్ లో వినిపించని ఆ ఒక్క మాట ?

ఏపీకి సంబంధించిన అనేక సమస్యలను కేంద్ర పాలకుల దృష్టికి తీసుకుని వచ్చారు.

Update: 2024-07-05 14:56 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లే. సీఎం గా నాలుగవ సారి బాధ్యతలు స్వీకరించిన తరువాత బాబు ఢిల్లీవెళ్ళి మూడు రోజుల పాటు ఫుల్ బిజీగా గడిపారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలో కీలక మంత్రులు అందరితోనూ వరస భేటీలు వేశారు. ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షాలతో సైతం బాబు చర్చలు జరిపారు. బీజేపీలో బిగ్ షాట్ గా ఉన్న నితిన్ గడ్కరీ, రాజ్ నాధ్ సింగ్, జేపీ నడ్డాలతో బాబు భేటీలు వేశారు.

ఏపీకి సంబంధించిన అనేక సమస్యలను కేంద్ర పాలకుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఏపీ విభజన సమస్యలు కేంద్రానికి తెలియనివి కాదు, కానీ అయిదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ మరింతగా నష్టపోయింది అన్నది బాబు ఈసారి కేంద్రానికి పూర్తిగా వివరించారు అని అంటున్నారు. కేంద్రం అండ దండ కావాలని ఆదుకోవాలని బాబు పూర్తి స్థాయిలో విన్నపాలు పంపారు.

మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా బాబు చూపించడంలో విజయవంతం అయ్యారని అంటున్నారు. అదే టైంలో బాబు ఢిల్లీ టూర్ లో ఒక మాటను అయితే మరచిపోయారు అని అంటున్నారు. ఆయన అజెండాలో అది పెట్టుకోలేదా అలా పెట్టుకోకపోతే ఎందుకు అన్న చర్చ వస్తోంది.

Read more!

ఆ మాటే ప్రత్యేక హోదా. ఒక వైపు బీహార్ ప్రత్యేక హోదా నినాదాన్ని హోరెత్తిస్తోంది. ఈ సమయంలో ఎన్డీయేకు ఊతమిస్తున్న మరో కీలకమైన పార్టీగా టీడీపీ ప్రత్యేక హోదా అంశం ఎందుకు లేవనెత్తలేదు అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు అని అంటున్నారు. ప్రత్యేక హోదా అన్నది పవర్ ఫుల్ వెపన్ ఏపీలోని విపక్షానికి కాకూడదు అన్న ముందు చూపుతోనే బాబు ఇలా చేశారు అని అంటున్నారు.

ప్రత్యేక హోదా కేంద్రం ఎటూ ఇవ్వదు, బీహార్ లోని జేడీయూ కూడా ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ అని మరో ఆప్షన్ ఇచ్చారు. బాబు ఇపుడు ఆ రెండో ఆప్షన్ మీదనే ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. ఏపీకి దండీగా వివిధ ప్రాజెక్టుల కోసం నిధులు తెచ్చుకుంటే అభివృద్ధి సాధ్యపడుతుందని బాబు ఆలోచన అని అంటున్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఎపుడో ప్రకటించేసింది. దాంతో పాటు హోదా ఎవరికి ఇచ్చినా మరొకరు అడుగుతూనే ఉంటారు. అందుకే ఆ పేచీ పూచీల జోలికి కేంద్రం ససేమిరా పోదు. దాంతో హోదా అంశం తట్టి లేపి ఏపీ జనంలో ఎమోషన్స్ ని పెంచి తద్వారా వైసీపీకి జనంలోకి వచ్చేలా చాన్స్ ఇవ్వదలుచుకోలేదు అని అంటున్నారు.

అందుకే బాబు ప్రత్యేక హోదా అన్న మాటను తన నోట అసలు పలకలేదు అని అంటున్నారు. గతంలో ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ట్రాప్ లో పడి 2019 ఎన్నికల్లో అధికారం ఎలా పోగొట్టుకున్న సంగతి బాబుకు బాగా తెలుసు అని అంటున్నారు. అందుకే ఆయన ఆ ఇష్యూనే ఫోకస్ చేయదలచుకోలేదు అని అంటున్నారు.

ప్రభుత్వం ఈ ఇష్యూని పెద్దగా ఫోకస్ చేయకపోతే ప్రజలలో సైతం ఆశలు ఉండవు, విపక్షం అపుడు ఎంతగా మాట్లాడినా ఉపయోగం ఉండదు అన్నదే టీడీపీ స్ట్రాటజీ అని అంటున్నారు. అదే టైం లో కేంద్రంతో సఖ్యతగా ఉంటూ ఎక్కువ నిధులు ఏపీకి తెచ్చుకోవడం కూడా బాబు మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. ఒక ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా హోదా విషయంలో విషయంలో బాబు పదును పెట్టారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు హోదా విషయం బాబు ఎందుకు ఎత్తలేదని ప్రశ్నిస్తున్నారు. రేపో మాపో వైసీపీ ఈ విషయమే తమ అజెండా చేసుకునే అవకాశం ఉంది. అయితే అయిదేళ్ళ పాటు వైసీపీ అధికారంలో ఉండి ఏమి చేసింది అన్న ప్రశ్నలు జనం నుంచి కూడా రావచ్చు అని అంటున్నారు. ఇక అభివృద్ధి చేసి చూపిస్తే జనాలకు వేరే కావాల్సింది లేదు అన్నదే టీడీపీ ఆలోచన అని చెబుతున్నారు. సో ఆ ఒక్క మాట ఎత్తకుండా టోటల్ గా తన ఢిల్లీ టూర్ ని పూర్తి చేశారు అని అంటున్నారు.

Tags:    

Similar News

eac