ఒకప్పటి పంజాబ్ 'ఫస్ట్ ఫ్యామిలీ' మెంబర్... నేడు 'తంఖయ్య'గా ఎందుకు?

సుఖ్ బీర్ సింగ్ తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ 1947లో పంజాబ్ రాజకీయాల్లోకి బ్లాక్ సమితి ఛైర్మన్ గా అడుగుపెట్టారు.

Update: 2024-12-04 19:30 GMT

దేవాలయంలో శిక్ష అనుభవిస్తున్న పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్వర్ణదేవాలయ ప్రాంగణంలోనే ఆయనపై తుపాకీ కాల్పులు జరగడం సంచలనంగా మారింది. దీంతో.. ఒకప్పుడు పంజాబ్ లో 'ఫస్ట్ ఫ్యామిలీ'గా చలామణి అయిన ఫ్యామిలీకి చెందిన వ్యక్తికి నేడు ఈ పరిస్థితి ఏంటనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... సిక్కుల ప్రయోజనాల కోసం పనిచేసే శిరోమణి అకాలీదళ్ పార్టీ సుఖ్ బీర్ సింగ్ బాదల్ ను అధ్యక్ష పదవిని వీడమని అనడం, సిక్కులకు ద్రోహం చేసిన వ్యక్తిగా ఆయనను ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో బాదల్ కుటుంబం ఎలా ఉండేది, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఆసక్తిగా మారింది.

సుఖ్ బీర్ సింగ్ తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ 1947లో పంజాబ్ రాజకీయాల్లోకి బ్లాక్ సమితి ఛైర్మన్ గా అడుగుపెట్టారు. ఆ తర్వాత పదేళ్లలోనే అకాలీదళ్ నుంచి రాష్ట్ర విధాన సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1970లో తొలిసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఈ క్రమంలో... 1977-2017 మధ్య నాలుగు సార్లు సీఎం అయ్యారు.

ఈ సమయంలో పంజాబ్ పై బాదల్ ఫ్యామిలీ బలమైన పట్టు సంపాదించింది. ఫలితంగా... తరచూ మీడియా ఈ ఫ్యామిలీని "పంజాబ్ ఫస్ట్ ఫ్యామిలీ"గా అభివర్ణించేది. ప్రకాశ్ సింగ్ బాదల్ కు కుమారుడు సుఖ్ బీర్ సింగ్ తో పాటు కుమార్తె ప్రణీత్ కౌర్ కైరాన్ ఉన్నారు. ఆమెతో పాటు, ఆమె భర్త ప్రతాత్ సింగ్ కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

ఇక 2008లో 45 ఏళ్ల వయసులో అకాలీదళ్ పార్టీ పగ్గాలు అందుకున్న సుఖ్ బీర్ సింగ్ కేంద్రమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా పని చేయగా.. ఆయన భార్య హర్ సిమ్రత్ కౌర్ కూడా కేంద్రమంత్రిగా పని చేశారు. ఈ క్రమంలో... ఖలిస్థానీ మద్దతుదారు సంస్థ బబ్బర్ ఖల్సాకు చెందిన నరైన్ చౌరా అనే మిలిటెంట్ సుఖ్ బీర్ పై హత్యాయత్నం చేశాడు.

వాస్తవానికి పంజాబ్ లో అకాలీదళ్ పట్టును సడలించేందుకు ఖలీస్థాన్ ఉద్యమం తెరపైకి వచ్చిందని.. అప్పటి నుంచి బాద కుటుంబానికి ఇబ్బందికరంగా తయారయ్యిందని అంటారు.

ఇప్పుడు తంఖయ్యగా!:

అలా పంజాబ్ ఫస్ట్ ఫ్యామిలీ గా చలామణి అయిన బాదల్ కుటుంబానికి చెందిన సుఖ్ బీర్ ను సిక్కుల అత్యున్నత స్థానమైన శ్రీఅకాల్ తక్త్ సాహెబ్.. డిసెంబర్ 2న సుఖ్ బీర్ ను తంఖయ్య (సిక్కులకు ద్రోహం చేసిన వ్యక్తి)గా ప్రకటించింది. మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినందుకే ఈ శిక్ష అని అంటున్నారు.

ఇందులో భాగంగా... ఆయనతో పాటు అమ్రో 12 మంది అకాలీదళ్ నేతలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయం ప్రాంగణంలో రెండు రోజుల పాటు ఊడ్చడం, గిన్నెలు తోమడం, వాష్ రూమ్ లను శుభ్రం చేయడం వంటి పనులు చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News