సునీతా విలియమ్స్‌ రోదసీ యాత్ర మళ్లీ వాయిదా.. ఏమైంది?

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ రోదసీ యాత్ర మరోసారి ఆగింది

Update: 2024-06-02 09:35 GMT

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ రోదసీ యాత్ర మరోసారి ఆగింది. బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ క్యాప్సుల్ లో రోదరిలోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఉద్దేశించిన ప్రయోగం శనివారం చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో తాజా యాత్ర వరుసగా రెండు సార్లు వాయిదా పడినట్లు అయ్యింది.

అవును... బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయోగం మరోసారి వాయిదాపడింది. శనివారం ఈ ప్రయోగానికి రంగం సిద్ధంకాగా... చివరి నిమిషంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ వ్యోమనౌకలో సునీతా విలియమ్స్ తోపాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌ మోర్‌ లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనం కావాల్సింది.

ఈ క్రమంలోనే బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌ లైనర్‌ వ్యోమనౌక ప్రయోగం మరోసారి వాయిదా పడింది. శనివారం ఈ ప్రయోగానికి రెండోసారి రంగం సిద్ధం కాగా.. ప్రయోగానికి సరిగ్గా 3 నిమిషాల 50 సెకన్ల ముందు కౌంట్‌ డౌన్‌ ను కంప్యూటర్‌ వ్యవస్థ నిలిపివేసింది. అయితే ఇలా ఎందుకు జరిగిందనే కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.

ఈ విషయాన్ని డేటాను విశ్లేషిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో ఈ ప్రయోగం ఒకరోజు వ్యవదిలో తిరిగి జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా.. గత నెల 6న ఈ స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయోగానికి తొలి ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. అయితే... లీకేజీ సమస్య కారణంగా అదికాస్తా వాయిదా పడింది. యునైటెడ్‌ లాంఛ్‌ అలయన్స్‌ కు చెందిన "అట్లాస్‌-5" రాకెట్‌ ద్వారా స్టార్‌ లైనర్‌ ను వ్యోమనౌక నింగిలోకి పంపాల్సి ఉంది.

వాస్తవానికి ఈ యాత్ర ఎన్నో ఏళ్ల కిందట జరగాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా అదికాస్తా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను పంపడానికి "స్పేస్‌ ఎక్స్‌" సంస్థపైనే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ "నాసా" ఆధారపడుతూ వస్తోంది. ఈ సమయంలో... స్టార్‌ లైనర్‌ కూడా సిద్ధమైతే.. రెండో వ్యోమనౌక అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.

Tags:    

Similar News