బక్క చిక్కిపోయిన ఫోటో... సునీత విలియమ్స్ కు ఏమైంది...?
జూన్ 6న 8 రోజుల మిషన్ లో భాగంగా విల్ మోర్ తో కలిసి సునీత విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్ లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే
జూన్ 6న 8 రోజుల మిషన్ లో భాగంగా విల్ మోర్ తో కలిసి సునీత విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్ లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14న వీరిద్దరూ తిరిగిరావాల్సి ఉండగా.. వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా టెక్నికల్ సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్ ఆరోగ్యం దెబ్బతింటోందా అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... స్టార్ లైనర్ లో సమస్యల వల్ల అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ భూమికి తిరిగివచ్చేందుకు వచ్చే ఏడాది వరకూ ఆగాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. 8 రోజుల మిషన్ లో భాగంగా వెళ్లిన వీరు ఇప్పటికే అక్కడే ఉండిపోయారు. ఈ నెపథ్యంలో వారి తిరుగు ప్రయాణం చాలా ఆలస్యం అవ్వడంతో సునీత అనారోగ్యానికి గురైనట్లు కథనాలొస్తున్నాయి.
ఈ మేరతకు తాజాగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు సంబంధించిన ఫోటో ఒకటి షోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోలో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్లుగా, సన్నగా అయినట్లుగా కనిపిస్తున్నారు. ఈ సమయంలో స్పందించిన అమెరికాకు చెందిన డాక్టర్ వినయ్ గుప్తా... ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని అంటున్నారు!
ఇదే సమయంలో... వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వేంటనే వారి శరీరం స్పేస్ ఎనీమియాకు గురవ్వడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది. స్పేస్ లో ఉన్నప్పుడు వ్యోమగాముల్లో ఎర్రరక్త కణాలు క్షీణించే స్థితిని స్పేస్ ఎనీమియా అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు అలసట, నిస్సత్తువ, మానసిక - శారీరక పనితీరు దెబ్బతినడం జరుగుతుంటుందని చెబుతున్నారు.
మైక్రో గ్రావిటీకి ఎక్కువకాలం గురైనప్పుడు ఎర్రరక్తకణాల ఉత్పత్తిల్తో పోలిస్తే అవి క్షీణించే రేటు వేగంగా ఉంటుందని.. ఫలితంగా శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుందని.. ఫలితంగా ఈ సమస్యలు వస్తాయని అంటున్నారు. దీంతో... సునీత ఆరోగ్యం దెబ్బతింటుందనే ఆందోళనలు తెరపైకి వస్తున్నాయి.
కాగా... జూన్ 14న భూమిపైకి తిరిగి రావాల్సిన సునీతా విలియమ్స్... వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో.. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో సునీత విల్లియమ్స్ ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.