వివేకా హత్య జరిగింది అందుకే... భారతిపై సునీత తీవ్ర వ్యాఖ్యలు!

ఇదే సమయంలో... సీఎం జగన్ ను ఎదిరించి మాట్లాడగలిగే సత్తా వివేకాకు ఉండటంవల్లే హత్య చేశారంటూ సునీత కీలక కామెంట్లు చేశారు.

Update: 2024-05-10 11:53 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు శనివారం సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో ప్రచారకార్యక్రమాలు హోరెత్తిపోతున్నాయి. ఇదే సమయంలో క్లైమాక్స్ ని బలంగా ప్లాన్ చేస్తున్న అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లూ తమ తమ ట్రంప్ కార్డులను బయటకు తీస్తున్నారు! ఆ సంగతి అలా ఉంటే... రాష్ట్రంలోని ఫైట్ అంతా ఒకెత్తు.. కడప లోక్ సభ పరిధిలో ఫైట్ మరొకెత్తు అనే కామెంట్లు వినిపిస్తున్న నేపధ్యంలో తాజాగా వివేకా కుమార్తె సునీత.. వైఎస్ భారతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు!

అవును... గతకొన్ని రోజులుగా వైఎస్ వివేకా హత్య కేసుపై మాట్లాడుతున్న క్రమంలో వైఎస్ అవినాష్, ఆయనకు టిక్కెట్ ఇచ్చిన జగన్ లపై విరుచుకుపడుతున్న సునీత.. ఈ మధ్య వైఎస్ భారతిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగి, గది మొత్తం రక్తసిక్తమైపోతే గుండేపోటు అని ప్రసారం చేసింది భారతి అంటూ షర్మిళ విమర్శలు చేసిన నేపథ్యంలో... సునీత మరింత ఘాటుగా స్పందించారు.

ఇందులో భాగంగా... పులివెందులలో సింగల్ ప్లేయర్ గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారని మాట్లాడారు సునీత! ఇదే సమయంలో... "ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా" అని ప్రశ్నించిన ఆమె... భారతి.. "నన్ను నరికేస్తారో, లేక షర్మిలను నరికేస్తారో తెలియదు గానీ సింగిల్ ప్లేయర్ గా ఉండాలంటే అదొక్కటే పాజిబిలిటీ" అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

ఇదే సమయంలో... సీఎం జగన్ ను ఎదిరించి మాట్లాడగలిగే సత్తా వివేకాకు ఉండటంవల్లే హత్య చేశారంటూ సునీత కీలక కామెంట్లు చేశారు. ఇదే క్రమంలో... తనకు కూడా ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని, అందుకే తన పిల్లలకు ఆస్తులు వీలునామా రాసేశానని, అన్నింటికీ తెగించే పోరాడుతున్నానని సునీత తెలిపారు. ఇదే సమయంలో... అవినాష్ రెడ్డి చెప్పిన మాటలు నమ్ముతున్నట్లు జగన్ చెప్పడం ఏమిటని ఆమె ఘాటుగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా... దేశమంతా ఎన్నికలు సాధారణంగా జరుగుతుంటే కడప ఎన్నికలకు మాత్రం ప్రత్యేకత ఉందని చెప్పిన సునీత... కడపలో న్యాయానికి, నిందితులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, అందుకే ప్రపంచం అంతా చూస్తుందని తెలిపారు. అదేవిధంగా... షర్మిలను ఎంపీగా చేయాలని వివేకానంద రెడ్డి అనుకున్నా కుదరలేదని.. ఆయన కోరికను నెరవేర్చేందుకు ప్రజలంతా షర్మిళకు ఓటు వేసి న్యాయం వైపు నిలవాలని సునీత విజ్ఞప్తి చేశారు.

Full View
Tags:    

Similar News