సన్‌ రైజర్స్‌ "కావ్య మారన్‌" లగ్జరీ కార్ల లిస్ట్ ఇదే... ఆమె ఆస్తులెంతో తెలుసా?

అవును... కావ్య మారన్ వద్ద సూపర్ లగ్జరీ కార్ల కలెక్షన్ భారీగా ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... ఆమె గ్యారేజ్ లో తొలి అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయిస్ ఉంది.

Update: 2024-04-22 16:30 GMT

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాలతో దూసుకుపోతుంది. రికార్డ్ స్థాయి స్కోర్లు నమొదు చేస్తుంది. ఈ సమయంలో... సన్ రైజర్స్ జట్టు యజమాని కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ 2018 నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌ రైజర్స్ హైదరాబాద్ సీఈవోగా ఉంటున్నారు. ఈ సందర్భంగా జట్టును ఉత్సాహ పరుస్తూ ముందుండి నడిపిస్తున్నారు.

ఈ క్రమంలో ఆ జట్టు ఆడుతున్న దాదాపు అన్ని మ్యాచ్‌ లకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఆటగాళ్లుకు ఉత్సాహపరుస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఉన్న లగ్జరీకార్లకు సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది. "క్రేజీ కార్స్‌ చెన్నై" సమాచారం ప్రకారం.. రోల్స్ రాయిస్, బెంట్లీ నుండి ఫెరారీ వరకు అధునాతన, అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఆమె సొంతం అని తెలుస్తుంది.

అవును... కావ్య మారన్ వద్ద సూపర్ లగ్జరీ కార్ల కలెక్షన్ భారీగా ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... ఆమె గ్యారేజ్ లో తొలి అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయిస్ ఉంది. ఈ ప్రత్యేకమైన మోడల్ ఫాంటమ్ వీఐఐఐ ఈడబ్ల్యూబీ ధర భారతదేశంలో రూ.12.2 కోట్లుగా చెబుతున్నారు. ఇక, చెన్నై వీధుల్లో కనిపించిన తదుపరి కారు ఫెరారీ రోమా. 2021లో ఇండియాలో దీని ధర రూ.4.5 కోట్లుగా చెబుతున్నారు.

ఇదే క్రమంలో ఈమె వద్ద ఉన్న అద్భుతమైన రెడ్‌ షేడ్‌ బెంట్లీ కారు.. అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో మూడోదిగా ఉంది. ఈ బెంటెగా ఎక్స్‌ టెండెడ్ వీల్‌ బేస్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 6 కోట్లుగా ఉంది! వీటితోపాటు ఈ జాబితాలో లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ బీఎండబ్ల్యూ ఐ7 కూడా ఉంది. ఈ ప్రత్యేక కారు బ్లాక్ సఫైర్ మెటాలిక్ షేడ్‌ తో అదిరిపోయే లుక్‌ లో ఉంటుంది.

కాగా... సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్ - కావేరి మారన్ దంపతుల కుమార్తె కావ్య మారన్... 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్నించారు. ఈ క్రమంలో చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీ నుండి కామర్స్ డిగ్రీ, యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందిన కావ్యా మారన్... ప్రస్తుతం సన్‌ టీవీలోనూ కార్యకలాపాలు పర్యవేక్షిస్తు రూ. 409 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉన్నారని తెలుస్తుంది!

Tags:    

Similar News