జైలు ఖైదీల జీవితాలలో వెలుగు నింపిన మహారాష్ట్ర అమ్మాయిలు..

అయితే ఇద్దరు లేడీ జర్నలిస్టులు ఈ విషయంలో ఓ సరికొత్త పోరాటానికి నాంది పలికారు.

Update: 2024-10-07 15:20 GMT

నేరాలు చేసిన నేరస్తులు తమ తప్పును తెలుసుకొని శిక్ష అనుభవిస్తూ పశ్చాత్తాపంతో పరివర్తన చెందే ప్రదేశాలు జైలు. అయితే ఇవి కొందరి పాలిట చీకటి గదులుగా మారుతున్నాయి. అయితే ఇద్దరు లేడీ జర్నలిస్టులు ఈ విషయంలో ఓ సరికొత్త పోరాటానికి నాంది పలికారు. వారి సేవలను గుర్తిస్తూ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై. చంద్రచూడ్.. మహిళా జర్నలిస్టును ప్రశంసిస్తూ మాట్లాడారు.

‘సుకన్య శాంత మేడం.. మీరు ఎంతగానో పరిశోధించి అద్భుతంగా రాసిన ఈ కథనానికి నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ కేసుకు ప్రారంభం మీరు రాసిన కథనమే.. ఇది చదివిన తర్వాత వాస్తవికత ఎంతవరకు మారిందో తెలియదు కానీ క్షేత్రస్థాయిలో తీర్పు పరిస్థితిని మార్చగలిగింది అని భావిస్తున్నాను.. అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమెను ప్రశంసించారు.

కంటికి కనిపించిన వార్తలను ప్రజలకు వినిపించే జర్నలిస్టులు సాధారణంగా తాము రిపోర్టు చేసిన సమస్యను పరిష్కరించడం కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం అనేది ఎంతో అరుదుగా జరుగుతుంది. ఈ పనిని ది వైర్ మీడియా సంస్థలో పనిచేస్తున్న ఓ జర్నలిస్ట్ సుకన్య శాంత చేసి చూపించారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో ఉన్న జైల్లో చాప కింద నీరులా కొనసాగుతున్న కుల విపక్షతపై ఆమె వరుసగా ఎన్నో కథనాలు రాశారు.

వీటిలో జైలు ఖైదీల పట్ల కుల వివక్షత ఏ రకంగా ఉంది అన్న విషయాన్ని వివరిస్తూ.. ఖైదీలకు ఇచ్చే పనులు కులాల ఆధారంగా విభజన చేయబడుతున్నాయని.. ఖైదీలలో పరివర్తన బదులుగా కుల వివక్షత చోటు చేసుకుంటుంది అంటూ ఎన్నో కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు.. ఆమె ఒక సీరియస్ గా ప్రచురించిన ఈ విషయాలను సుమోటో కేసుగా రాజస్థాన్ హైకోర్టు స్వీకరించింది. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న అన్ని జైలుల నిబంధనలను మార్చాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.

ఊహించని రీతిలో హైకోర్టు నుంచి తన కథనానికి ఒక సానుకూల స్పందన రావడంతో సుకన్య శాంత.. లాయర్ దిశా వాడేకర్‌ సహాయంతో సుప్రీంకోర్టు వరకు ఈ కేసును తీసుకువెళ్లారు. ఈ ఇద్దరు మహారాష్ట్ర అమ్మాయిలు సుప్రీంకోర్టులో వెలువడిన చారిత్రాత్మిక తీర్పు లో భాగమయ్యారు. అక్టోబర్ 3, 2024న కుల వివక్షతను ప్రోత్సహించడం జైలు నిబంధనలకు.. రాజ్యాంగానికి విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు తీర్పు జారీ చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జైలకు సంబంధించిన నిబంధనలను సవరించుకోవాలని కూడా ఆదేశించింది. ఎవరో సమస్య ఎదుర్కొంటున్నప్పుడు మనకెందుకు అనుకోకుండా.. ఆడవాళ్ళం అని వెనుకంజ వేయకుండా.. దేశంలో ఎన్నో జైళ్ళలో మగ్గిపోతున్న జైలు ఖైదీల వ్యధకు గళాన్ని అందించి.. ఓ చారిత్రాత్మికమైన తీర్పు వెలువడడానికి సుకన్య శాంత, దిశా వాడేకర్‌లు కారణమయ్యారు.

Tags:    

Similar News