కొండా సురేఖకు రోడ్డు ప్రమాదం.. కన్నీళ్లు పెట్టుకున్న మురళి!

అవును... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో కొండా సురేఖ గాయపడ్డారు.

Update: 2023-10-19 11:59 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో అన్ని పార్టీలూ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నాయి. బహిరంగ సభలు, బైక్ ర్యాలీ, మేని ఫెస్టోల విడుదల, ఉచిత హామీల ప్రకటనలతో తెలంగాణలో రాజకీయాల్లో హోరెత్తిపోతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ చేపట్టింది. ఆ ర్యాలీలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ గాయపడ్డారు.

అవును... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో కొండా సురేఖ గాయపడ్డారు. ఈ కార్యక్రమంలో... పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న కొండా సురేఖ... స్వయంగా స్కూటీ నడిపారు. ఈ సమయంలో సురేఖ నడుపుతున్న స్కూటీ అదుపుతప్పడంతో ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి!

ఇందులో భాగంగా... ముఖం కుడి భాగంలోనూ, కాలికి, తలకీ కూడా గాయాలయ్యాయని తెలుస్తుంది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆమెను హుటాహుటున హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇందులో భాగంగా దీంతో... ఆమె ముఖానికి వైద్యులు డ్రెస్సింగ్ వేశారు. అనంతరం ఆమె కుడికాలికి కూడా కట్టుకట్టారు.

విషయం తెలుసుకున్న కొండా మురళి... హుటాహుటున ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు తగిలిన గాయాలు చూసిన మురళి కన్నీళ్లు పెట్టుకున్నారని తెలుస్తుంది. మరోవైపు, రాహుల్ గాంధీ విజయభేరి యాత్ర కొనసాగుతోంది. స్థానిక ప్రజలను రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు కలిశారు. తాము ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు.

కాగా... తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 55 మందితో కూడిన ఈ జాబితాను కాంగ్రెస్ ఇటీవల ప్రకటించింది. ఇక, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కొండా సురేఖ టికెట్ ఆశిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో ఆమె పేరు లేదు!

Tags:    

Similar News