పిఠాపురం వర్మ ట్వీట్ వైరల్...కష్టపడి గెలిస్తేనే !

ఎందుకంటే తన ఎక్స్ హ్యాండిల్ లో వర్మ పెట్టిన పోస్టుతో పాటుగా వీడియోను కూడా జత చేశారు.

Update: 2025-02-20 14:14 GMT

పిఠాపురం వర్మ సడెన్ గా ఒక ట్వీట్ వేసారు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కష్టపడి గెలిస్తేనే అంటూ వర్మ వేసిన ఈ ట్వీట్ ఎవరి మీద ఎద్నుకోసం అన్నదే ఇపుడు చర్చ నడుస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద ఈ ట్వీట్ వేసారా అన్న సందేహాలూ తలెత్తుతున్నాయి. ఎందుకంటే తన ఎక్స్ హ్యాండిల్ లో వర్మ పెట్టిన పోస్టుతో పాటుగా వీడియోను కూడా జత చేశారు.

దానిలో వర్మ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం గత ఎన్నికల్లో తాను చేసిన ప్రచారానికి సమంధించిన వీడియోలు మొత్తం ఉన్నాయి. తమాషా ఏంటి అంటే ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు. అంటే పడిన కష్టం అంతా వర్మదే అన్నట్లుగా ఈ వీడియోలు ఉన్నాయి. మరో వైపు చూస్తే ఈ ట్వీట్ కి పెట్టిన ట్యాగ్ అత్యంత చర్చనీయాంశంగా ఉంది. కష్టపడి గెలిస్తే అన్నది చాలా సంచలనాత్మకమైన వ్యాఖ్యగా ఉంది.

దానికి అర్ధాలు పరమార్ధాలు అంతా వెతుకుతున్నారు తాను ప్రచారం చేశాను ఎంతో కష్టపడ్డాను అన్నట్లుగా వర్మ పెట్టినట్లుగా ఈ ట్వీట్ ఉందని పవన్ కష్టపడలేదని కూడా కోరి చెప్పినట్లుగా ఉందని అంటున్నారు. ఇక పిఠాపురం వర్మకు బ్రహ్మాండమైన అనుచర గణం ఉంది. ఆయన 2014లో ఇండిపెండెంట్ గలిచారు అంటేనే ఆయన సొంత బలం చాలానే ఉంది అని అర్థం కదా. దాంతో వారంతా ఆయన పెట్టిన ట్వీట్ కి మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే పిఠాపురం వర్మ ఈ ట్వీట్ వెనక సమయం సందర్భం కూడా ఉన్నాయని అంటున్నారు. ఆయన పిఠాపురం నుంచి పోటీకి సర్వం సిద్ధం చేసుకున్న వేళ లాస్ట్ మినిట్ లో పవన్ వచ్చి పొత్తులో ఆ సీటు తీసుకున్నారు. దాంతో వర్మ తన కోసం కాకుండా పవన్ కోసం ఎంతో శ్రమించి పనిచేశారు. ఆ తరువాత ఆయనకు చంద్రబాబు పవన్ ల నుంచి హామీ ఒకటి లభించింది.

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చక తొలి ఎమ్మెల్సీ సీటు వర్మకే ఇస్తామన్నది ఆ హామీ. తీరా చూస్తే వర్మకు హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు. దాంతో వర్మలో ఆవేదన పెరిగిపోతోంది అని అంటున్నారు తొమ్మిది నెలల కూటమి పాలనలో వర్మకు ఏమీ దక్కలేదు. దాంతో ఆయన ఆ బాధతోనే ఈ ట్వీట్ పెట్టారా అన్న చర్చ నడుస్తోంది.

తాను ఎంతో కష్టపడి పవన్ ని గెలిపించాను అని అర్ధం వచ్చేలా ఆయన పెట్టిన ఈ ట్వీట్ కూటమి పెద్దల దృష్టిలోకి వెళ్ళాలని ఇలా చేశారా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా వర్మ మాత్రం తనకు సరైన పదవి దక్కలేదని బాధలో ఉన్నారని మాత్రం ఈ ట్వీట్ చూస్తే అర్ధం అవుతోంది అన్న వారూ ఉన్నారు అదే సమయంలో పవన్ గెలుపులో కష్టం అంతా తనది అన్నది కూడా ఆయన వ్యక్తం చేశారని అంటున్నారు.

Tags:    

Similar News