జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి: వర్మ పిలుపు
ఏపీలో జరిగిన హోరా హోరీ ఎన్నికల ప్రచారంలో నందమూరి వారసుడు, అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు తరచుగా వినిపించింది
ఏపీలో జరిగిన హోరా హోరీ ఎన్నికల ప్రచారంలో నందమూరి వారసుడు, అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు తరచుగా వినిపించింది. అయితే.. తర్వాత. ఎవరూ పెద్ద గా స్పందించలేదు. కానీ, తాజాగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రచారం చేసి.. ఆయన గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న ఎస్ వీఎస్ ఎన్ వర్మ.. జూనియర్‌కు ఆహ్వానం పలికారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
''సినీ రంగాన్ని వదులుకుని తెలుగు దేశం కోసం.. పనిచేయాలని అనుకుంటే. జూనియర్ ఎన్టీఆర్ కు నేను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటా. ముందు ఆయన పార్టీలో చేరి... తనను తాను నిరూపించుకోవాలి. నారా లోకేష్‌కు.. ఎన్టీఆర్‌కు మధ్య పోలికలు ఉన్నాయని చెప్పడం కేవలం అభూత కల్పనే'' అని వర్మవ్యాఖ్యానించారు.
గత దశాబ్ద కాలం నుంచి నారా లోకేష్ టీడీపీ కోసం పనిచేస్తున్నారని వర్మ తెలిపారు. ఆయన పార్టీకి ఒక ఇంజన్‌గా మారిపోయారని చెప్పారు. నాయకత్వ బాధ్యతలు తీసుకోవడంలోనూ నారా లోకేష్ ముందున్నారని చెప్పారు. పార్టీని, కార్యకర్తలను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో నారా లోకేష్ పాత్ర అద్భుతమని కొనియాడారు. అందుకే.. ఆయనను పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా.. స్వాగతిస్తున్నారని తెలిపారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా నారా లోకేష్‌ను అభివర్ణించారు..
అందుకే తాము ఎన్జీఆర్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్టు వర్మ వివరించారు. ఆయన సినీ రంగాన్ని వీడి టీడీపీ కోసం పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదిలావుంటే.. ఇటీవల నారా లోకేష్ కూడా..జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే. ''జూనియర్ ఎఎన్టీఆర్ వస్తానంటే ఆహ్వానించేందుకు నేను ఎప్పుడూ సిద్ధమే. కష్టపడి పనిచేసి.. పార్టీ కోసం.. శ్రమించేవారు ఎవరైనా రావొచ్చు'' అని నారా లోకేష్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.