నా గదిలో అది అమ్మ కంట పడింది.. స్టాండప్ కమెడియన్ జోక్ అపహాస్యం
ఇప్పుడు మరో స్టాండ్ అప్ కమెడియన్ స్వాతి సచ్‌దేవా తన తల్లిదండ్రులను అశ్లీల కంటెంట్ లోకి డ్రాగ్ చేసింది.;

స్టాండప్ కమెడియన్లు హద్దు మీరుతున్నారు. వారి భాష సరిహద్దులు దాటుతోంది. భావ వ్యక్తీకరణ ఛీప్‌గా మారుతోంది. స్పాంటేనియస్ గా ఎలాంటి జోక్ వేయాలో.. ఎలాంటి జోక్ వేయకూడదో లేదా ఏది జోక్ అవుతుందో.. ఏది జోక్ కాదో కూడా గమనించలేనంత తెలివితక్కువతనం ఒక్కోసారి బయటపడుతుంది. ప్రతిదానికి భూతద్దం పెట్టే మీడియా ఉన్న ఈ రోజులలో ఇంత తెలివి తక్కువగా ఎలా దొరికిపోతున్నారో కానీ, ఇప్పుడు ప్రముఖ మహిళా స్టాండప్ కమెడియన్ అడ్డంగా బుక్కయిపోయారు.
తల్లిదండ్రుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా తీవ్రంగా చీవాట్లు తిన్న తర్వాత.. ఇది మరో కొత్త కేసు. ఇప్పుడు మరో స్టాండ్ అప్ కమెడియన్ స్వాతి సచ్‌దేవా తన తల్లిదండ్రులను అశ్లీల కంటెంట్ లోకి డ్రాగ్ చేసింది. తల్లిని ప్రస్థావిస్తూ అసభ్యకర జోక్ వేయడంతో ఇంటర్నెట్ లో కలకలం సృష్టించింది. స్వాతి తాజా ప్రదర్శనలలో ఒకదాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది నెటిజనులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఈ వీడియోలో స్వాతి పరిహాసం ఇలా ఉంది. తన గదిలో తన తల్లి వైబ్రేటర్ ని కనుగొన్నారని స్వాతి అన్నారు. ఏదో జోక్ చేయాలని అనుకున్నా కానీ, ఇది వివాదాస్పదమైంది. చాలా మంది ఈ అశ్లీల జోక్ ని ఆస్వాధించలేకపోయారు. తన తల్లి ఏమీ తెలియనట్టు కూల్‌గా నటించడానికి ప్రయత్నిస్తోందని, దాని గురించి మాట్లాడటానికి ఇబ్బంది పడుతోందని స్వాతి పేర్కొంది. అది ఒక బొమ్మ.. గాడ్జెట్ అంటూ సర్ధి చెబుతోంది. అంతేకాదు.. ఇబ్బంది పడకుండా ఉండటానికి, అది తనది అని చెప్పిందని స్వాతి ఛమత్కరించే ప్రయత్నం చేసింది.
అమ్మా అది నీది కాదు నాన్నది.. అని అంటుంటే, అర్ధంలేని మాటలు మాట్లాడకు.. ఆయన ఎంపిక నాకు తెలుసు! అని తన తల్లి తనతో అన్నారని చెప్పింది. అప్పుడే అమ్మ దానిని బయటకు తెచ్చి నన్ను అడుగుతోంది..అని స్వాతి సచ్‌దేవా అసభ్యకరమైన సంభాషణను కొనసాగించి విసిగించింది. ఈ ప్రదర్శనలో హాస్యం కంటే వెగటు పుట్టించే అశ్లీల కంటెంట్ మోతాదు ఎక్కువైంది. అయితే సచ్ దేవ్ అశ్లీల జోకులకు ఆడియెన్ కడుపుబ్బా నవ్వుకున్నారు. కానీ నెటిజనుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది జుగుప్సాకరం.
స్వాతి ప్రదర్శనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించిన వెంటనే చాలా మంది నెటిజన్లు అసహ్యం వ్యక్తం చేసారు. స్టాండప్ కమెడియన్ అసభ్యకరమైన భాషను ఉపయోగించినందుకు చాలామంది విమర్శించగా, మరికొందరు వ్యక్తిగత కుటుంబ విషయాలను ఇలా కామెడీ చేసినందుకు తీవ్రంగా తిట్టారు. కామెడీ పేరుతో ఈ అమ్మాయి అశ్లీలత పరిమితులను అధిగమించింది. ఆమె తన తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టలేదు. ఇది హాస్యం కాదు.. విలువలకు తిలోదకం. అలాంటి అశ్లీలతను ప్రోత్సహించడం తప్పు అని ఒక నెటిజన్ విమర్శించాడు. మరో నెటిజన్ నేరుగా PMO ని ట్యాగ్ చేసి ఇలాంటి స్టాండప్ కమెడియన్లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇలాంటి షోలను కంటెంట్ ని నిషేధించాలని కోరాడు. ఇది `ఇండియాస్ గాట్ లాటెంట్` అసభ్యత కంటే తక్కువనా...?? అని విమర్శించాడు.
కొద్ది రోజుల క్రితం స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా `ఇండియాస్ గాట్ లాటెంట్` గురించి అల్లాబాడియా చేసిన వ్యాఖ్య తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఎఫ్.ఐ.ఆర్ లు, చట్టపరమైన చర్యలతో వేడెక్కింది. కొన్ని వారాల పాటు దీనిపై చర్చోపచర్చలు సాగాయి. ప్రస్తుతం ఈ తరహా సైబర్ కేసులపై విచారణ సాగుతోంది. ప్రధాని స్థాయి వ్యక్తికి ఫిర్యాదు చేసారు అంటే కచ్ఛితంగా ఇక ఈ తరహా షోలపై సెన్సార్ షిప్ విధించాలని ఆదేశాలు జారీ అవుతాయని భావిస్తున్నారు. అయితే స్టాండప్ కమెడియన్లు లైవ్ లో ఎలాంటి ప్రాక్టీస్ కానీ ప్రామ్టింగ్ కానీ లేకుండా స్పాంటేనియస్ గా జోక్స్ వేయాలి. అది సాధారణ నటులు కూడా చేయలేనిది. అది అంత సులువు కాదనేది గమనించాలి.