హైదరాబాద్ అంటే ముక్క ముద్దే కాదు.. స్విగ్గీలో ఆసక్తికర వివరాలు!

సాధారణంగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అంటే... అందులో నాన్ వెజ్ వంటకాల ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు

Update: 2024-08-01 11:30 GMT

సాధారణంగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అంటే... అందులో నాన్ వెజ్ వంటకాల ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే... ఆ లెక్క తప్పంటుంది స్విగ్గీ!! దేశవ్యాప్తంగా ఉత్తమ శాఖాహార వంటకాలు, వాటిని అందించే రెస్టారెంట్లకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేందుకు గ్రీన్ డాట్ అవార్డుల పేరిట స్విగ్గీ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఇందులో భాగంగా... తమకు వచ్చే ఆర్డర్లను విశ్లేషించి ఓ నివేదిక విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో... స్విగ్గీకి అత్యధికంగా వచ్చే ఆర్డర్స్ లో టాప్ 10 వంటకాల్లో ఆరు శాఖహార వంటకాలే ఉన్నాయంట. ఇందులో ప్రధానంగా మసాల దోశ, పన్నీర్ బటర్ మసాలా, మార్గెరిటా పిజ్జా, పావ్ బాజీ టాప్ ప్లేస్ లో ఉన్నాయని అంటున్నారు!

ఇక ఈ వెజ్ ఆడర్స్ లో భారతదేశంలో టాప్ 3 ప్లేస్ లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరం కూడా ఉంది. ఇందులో భాగంగా... వెజ్ ఫుడ్ ఆర్డర్లలో సిలికాన్ వ్యాలీ బెంగళూరు ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై రెండో ప్లేస్ లో ఉందని స్విగ్గీ డేటా చెబుతోంది. ఇక చికెన్ ధమ్ బిర్యానీకి కేరాఫ్ అడ్రస్ అయిన హైదరాబాద్ మూడో స్థానంలో ఉండటం గమనార్హం.

అవును... వెజ్ ఫుడ్ ఆర్డర్స్ పై స్విగ్గీ ఇంటర్నల్ డేటా అనాలసిస్ ఫలితాలను పరిశీలిస్తే... షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చయనే భావించాలని అంటున్నారు. ఇందులో భాగంగా.. సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరూ.. ఇప్పుడు వెజ్ వ్యాలీ కూడా అయ్యిందని అంటున్నారు. ఇందులో భాగంగా... ప్రతీ మూడు వెజ్ స్విగ్గీ ఆర్డర్స్ లో ఒకటి బెంగళూరు నుంచే అని నివేదిక వెళ్లడించింది.

ఇక్కడ నుంచి వచ్చే ఆర్డర్స్ లో మసాలా దోస, పనీర్ బిర్యానీ, పనీర్ బటర్ మసాలా లు టాప్ వెజ్ వంటకాలుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో... ఈ జాబితాలో రెండో సిటీగా ముంబై ఉందని స్విగ్గీ నివేదిక వెల్లడించింది. ఇక్కడ ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చే వంటకాల్లో... దాల్ ఖిచిడీ, మార్గరీటా పిజ్జా, పావ్ భాజీ ఉన్నాయని తెలిపింది.

ఈ ర్యాకింగ్స్ లో మూడో స్థానంలో చికెన్ ధమ్ బిర్యానీ కా అడ్డా హైదరాబాద్ ఉండటం గమనార్హం! ఇక్కడ ప్రధానంగా మసాలా దోస, ఇడ్లీ అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ఆర్డర్లుగా స్విగ్గీ పేర్కొంది. ఇక ఫ్లాంట్ ఫాం లో 90శాతం కంటే ఎక్కువ బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్లు శాఖాహారమే కాబట్టి.. దీన్ని "బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్స్ కి గోల్డెన్ అవర్" అని పిలిచింది.

Tags:    

Similar News