సూసైడ్ క్యాప్సుల్ సాయంతో వ్యక్తి మృతి... స్విస్ పోలీస్ సీరియస్!

మేరీషాజన్ అటమీ ప్రాంతంలోని ఓ ఇంటిలో కొంతమంది వ్యక్తుల సాయంతో ఈ సార్కో ద్వారా ఆత్మహత్య జరిగినట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారని అంటున్నారు.

Update: 2024-09-25 08:27 GMT

ఈ ఏడాది జూలై ఆ ప్రాంతంలో అసిస్టెడ్ డైయింగ్ కోసం వాదించే ఓ సమూహం.. స్విట్జర్లాండ్ లో తొలిసారిగా పోర్టబిల్ సూసైడ్ పాడ్ ను ఉపయొగించవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల వైద్య పర్యవేక్షణ లేకుండానే తమ జీవితాలను ప్రశాంతంగా, నిమిషంలోపు ముగించొచ్చని స్విస్ మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే ఈ ఆలోచన తీవ్ర విమర్శలను ఎదుర్కోంది. సార్కో క్యాప్సుల్ అని పిలవబడే బాక్స్ లోపల పడుకుని బటన్ నొక్కితే నైట్రోజన్ గ్యాస్ విడుదలయ్యి ఆ వ్యక్తి ఒక్క నిమిషంలోనే చనిపోతారు! దీన్ని ఉపయోగించడానికి 20 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని కథనాలొచ్చాయి. అయితే... తాజాగా ఈ బాక్స్ సాయంతో ఓ వ్యక్తి మరణించాడని అంటున్నారు.

అవును... సూసైడ్ క్యాప్సుల్ సాయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని.. ఈ సమయంలో అతడికి కొంతమంది సహకరించారనే అనుమానంతో స్విట్జర్లాండ్ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని, వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాము సీరియస్ గా పరిగణిస్తున్నట్లు వారు పేర్కొన్నారని అంటున్నారు.

మేరీషాజన్ అటమీ ప్రాంతంలోని ఓ ఇంటిలో కొంతమంది వ్యక్తుల సాయంతో ఈ సార్కో ద్వారా ఆత్మహత్య జరిగినట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారని అంటున్నారు. ఈ సమయంలో సదరు వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించారని, సహకరించార్నే అనుమానంతోనే పలువురిని అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News