తారక్ వదిలేసినా.. అతనిపైనే రాజకీయాలు..

జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలం నుంచి రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికలలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు

Update: 2024-03-01 03:50 GMT

జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలం నుంచి రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికలలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. తరువాత నుంచి పార్టీ వ్యవహారాలకి, ప్రత్యక్ష రాజకీయాలకి తారక్ దూరంగానే ఉన్నారు. అయితే తన మద్దతు మాత్రం ఎప్పటికి తెలుగుదేశం పార్టీకి ఉంటుందని చాలా సందర్భాలలో తారక్ చెప్పారు.

గత ఏడాది నుంచి ఏపీ రాజకీయాలలో తారక్ పేరు విపరీతంగా మార్మోగిపోతుంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి మీద విమర్శలు చేసిన సమయంలో తారక్ పెద్దగా రియాక్ట్ కాలేదని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. బాబు అరెస్ట్ సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దీనికి కారణం ఏంటనేది ఎవరికి తెలియదు.

తారక్ కి అత్యంత సన్నిహితులైన వల్లభనేని వంశీ, కొడాలి నాని వైసీపీలో ఉన్నారు. దీంతో తారక్ పేరు, ఇమేజ్ ని వారు ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు. టీడీపీ మీటింగ్ లు ఎక్కడ జరిగిన జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో, పార్టీ జెండాలపై తారక్ ఫోటోలు ముద్రించి హడావిడి చేస్తూ ఉంటారు.

ఈ మధ్య వైసీపీ మీటింగ్ లలో కూడా తారక్ ఫోటోలు కనిపిస్తూ ఉండటం విశేషం. ముఖ్యంగా కొడాలి, వల్లభనేని వంశీ నియోజకవర్గాలలో తారక్ ఫోటోలతో వైసీపీ అభిమానులు సందడి చేస్తూ ఉంటారు. ఈ ఫోటోలు చూసిన తర్వాత తారక్ రాజకీయాలని వదిలేసిన రాజకీయాలు తారక్ ని వదలడం లేదు అనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది.

రెండు పార్టీలు ఎవరికి నచ్చిన విధంగా వారు జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ని వాడేసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే తారక్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీదనే పెట్టాడు. పాన్ ఇండియా బ్రాండ్ తెచ్చుకొని గ్లోబల్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే రాజకీయాల జోలికి వెళ్ళడం లేదు. తన పేరుని ఎవరు ఎన్ని విధాలుగా వాడుకుంటున్న రియాక్ట్ కావడం లేదు అని తారక్ తారక్ సన్నిహితుల నుంచి వినిపిస్తోన్న మాట.

ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక మొదటి భాగం అక్టోబర్ 10న రాబోతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

Tags:    

Similar News