మోడీకే దిమ్మ తిరిగే షాకిచ్చిన సొంత పార్టీ నేతలు

బీజేపీకి మొత్తానికి పెద్దోడైన మోడీ లాంటి అధినేత రాష్ట్రానికి వస్తున్నప్పుడు.. పేరున్న ఆ పార్టీ నేతలంతా ఆయన్ను కలిసేందుకు.. స్వాగతం పలికేందుకు క్యూ కడతారు.

Update: 2023-10-02 04:31 GMT

కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు రోజుల్లోకి వచ్చేసిన వేళ.. తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు బీజేపీ బిగ్ బాస్.. ప్రధాని నరేంద్ర మోడీ. వరుస పెట్టి రెండు రోజులు తెలంగాణలో పర్యటిస్తున్న ఆయన.. తన మొదటి పర్యటనను మహబూబ్ నగర్ లో చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణకు పెద్ద ఎత్తున వరాల్నిప్రకటించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పసుపు బోర్డు ప్రకటనతో పాటు.. పలు వరాల్ని ప్రకటించటం ద్వారా.. ఎన్నికల వేడికి మరింత రాజేశారు.

ప్రధాని మోడి వరాలపై బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్.. హరీశ్ లతో సహా పలువురు తప్పు పట్టటంతెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మోడీ పర్యటన వేళ.. తెలంగాణ బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీకి మొత్తానికి పెద్దోడైన మోడీ లాంటి అధినేత రాష్ట్రానికి వస్తున్నప్పుడు.. పేరున్న ఆ పార్టీ నేతలంతా ఆయన్ను కలిసేందుకు.. స్వాగతం పలికేందుకు క్యూ కడతారు.

అందుకు భిన్నంగా పలువురు ముఖ్య నేతలు మిస్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకూ మోడీ టూర్ వేళ.. మిస్ అయిన నేతల్ని చూస్తే.. ఆ జాబితా కాస్త పెద్దదిగా ఉండటం గమనార్హం. ఇంతకూ మోడీ సభకు డుమ్మా కొట్టిన ముఖ్యనేతల్లో..

- ఎంపీ సోయం బాపూరావు

- మాజీ ఎంపీ విజయశాంతి

- వివేక్

- మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

వీరంతా కూడా పార్టీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీలోకి వచ్చిన కొత్త వారికి పెద్ద పెద్ద పదవులు ఇస్తున్న వారు.. తమను అధిష్ఠానం అస్సలు పట్టించుకోవటం లేదన్న అభిప్రాయంతో ఉన్నారు. అందుకే.. ఢిల్లీ నుంచి వచ్చేది ఎంత పెద్దోళ్లు అయినా.. కలిసేది లేదంటూ సరికొత్త నిరసన వ్రతాన్ని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే.. బీజేపీ బిగ్ బాస్ మోడీ టూర్ వేళ.. గైర్హాజరు అయినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం బీజేపీలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇలాంటి అనుభవం మోడీకి ఇప్పటివరకు ఎదురుకాలేదన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనిపై మోడీ మాష్టారి రియాక్షన్ బయటకు రావాల్సి ఉంది.

Tags:    

Similar News