టీ కాంగ్రెస్ కొత్తా కొత్తా జోష్‌లు... !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరాల‌నే క‌సితో ప‌నిచేస్తోంది. ఈ క్ర‌మంలో వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలో చేర్చుకోవ‌డం.. అందిన కాడికి మ‌ద్ద‌తును తీసుకోవ‌డం.. ఇప్పుడు చ‌ర్చ‌నీ యాంశంగా మారింది.

Update: 2023-11-03 23:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరాల‌నే క‌సితో ప‌నిచేస్తోంది. ఈ క్ర‌మంలో వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలో చేర్చుకోవ‌డం.. అందిన కాడికి మ‌ద్ద‌తును తీసుకోవ‌డం.. ఇప్పుడు చ‌ర్చ‌నీ యాంశంగా మారింది. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చేవారు పెరుగుతున్నార‌నే చ‌ర్చ‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు. అంటే.. తాము బ‌ల‌ప‌డుతున్నామ‌నే సంకేతాలు పంపాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ కు ఇది మేలు చేస్తుంద‌ని నాయ‌కులు అంచ‌నావేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. దీనిపై ఇంకా కాంగ్రెస్ నాయ‌కులు స్పం దించలేదు. ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన రాజ‌ధాని ఉద్య‌మ స‌మితి.. ఏపీ ప‌రిర‌క్ష‌ణ సమితి కూడా కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఏపీ ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉన్న స్థానాల్లో ప్ర‌చారం చేస్తామ‌ని కూడా స‌మితి అధ్య‌క్షుడు ప్ర‌క‌టించ‌రు. ఇక‌, ష‌ర్మిల కూడా. త‌న పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తుంద‌ని.. ప్ర‌చారం కూడా చేస్తుంద‌ని అన్నారు.

అయితే.. ఈ రెండు ప‌రిణామాలు కాంగ్రెస్‌కు మేలు చేస్తాయా? అంటే.. పెద‌వి విరుపులే క‌నిపిస్తున్నాయి . నిన్న మొన్న‌టి వ‌ర‌కు ష‌ర్మిల‌పై వీహెచ్ హ‌నుమంత‌న్న నుంచి మ‌ధు యాష్కీ వ‌ర‌కు విమ‌ర్శ‌లు గుప్పిం చారు. ఆమెను ఏపీ నాయ‌కురాలిగా ప్రొజెక్టు చేశారు. ఏపీలో పార్టీ పెట్టుకుంటే క‌లిసి వ‌స్తుంద‌ని స‌ల‌హాలు ఇచ్చారు. మొత్తంగా ష‌ర్మిల‌పై ఏపీ ముద్ర వేశారు. కానీ, ఇప్పుడు అదే పార్టీ కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.

ఎన్నిక‌ల‌కుముందు.. ఈ ప‌రిణామం కాంగ్రెస్ నాయ‌కులు బాగానే ఉండి ఉండొచ్చు కానీ.. ఎప్పుడు చాన్స్ దొరుకుతుందా? అని ఎదురు చూస్తున్న బీఆర్ ఎస్‌కు ఇది మంచి ఆయుధంగా మారే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి. ష‌ర్మిల అంటే.. ఏపీకి చెందిన నాయ‌కురాలిగానే ప్రచారం చేస్తున్న బీఆర్ ఎస్ నాయ‌కులు.. ఇప్పుడు కాంగ్రెస్‌ను కూడా ఇదే కోణంలో తూర్పార‌బ‌ట్ట‌డం.. ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం చేయ‌డం ఖాయం.

ఇక‌, ఏపీకి చెందిన ప‌రిర‌క్షణ స‌మితితో చేత‌లు క‌ల‌ప‌డాన్ని కూడా.. కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేలా బీఆర్ ఎస్ వ్య‌వ‌హ‌రించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. మ‌ద్ద‌తు మాట ఎలా ఉన్నా.. బీఆర్ ఎస్ నుంచి ఈ విష‌యంలో ఎదుర‌య్యే ముప్పును కూడా కాంగ్రెస్ అంచ‌నా వేస్తే బెట‌ర్ అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News