దావోస్ లో ఏపీ రాజకీయాల మీద బాబు క్లారిటీ!

ఇదిలా ఉంటే దావోస్ టూర్ లో బాబు మీడియాతో మాట్లాడిన అనేక అంశాలు ఏపీ రాజకీయాల మీద పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చారు.

Update: 2025-01-23 17:55 GMT

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్ని విషయాల మీద మాట్లాడతారు, ఆయన మీడియాతో ఎంతసేపు అయినా ఇంటరాక్ట్ అవుతారు. అయితే బాబు ఎన్ని గంటలు మాట్లాడినా మీడియా ఎంత లోతుగా ప్రశ్నించినా ఆయన అనుకున్నది మాత్రమే చెబుతారు. తాను చెప్పే ప్రతీ విషయంలో బాబుకు పక్కా క్లారిటీ ఉంటుంది.

ఇదిలా ఉంటే దావోస్ టూర్ లో బాబు మీడియాతో మాట్లాడిన అనేక అంశాలు ఏపీ రాజకీయాల మీద పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చారు. ఆయనకు వచ్చిన ప్రశ్నలు ఏంటి అంటే ఏపీలో మళ్ళీ జగన్ సీఎం అవుతారా అని. దానికి బాబు ఇచ్చిన బదులు ఏంటి అంటే ఒకసారి మాత్రమే ఎవరైనా మోసం చేయగలుగుతారు అని.

అంటే జగన్ 2019లో అధికారంలోకి వచ్చింది జనాలను మభ్యపెట్టి అని. అయిదేళ్ళ పాలన తరువాత వైసీపీ అధినాయకత్వం తీరు జనాలకు బాగా అర్థం అయింది అని అందువల్ల ఆయనను తిరిగి ఎన్నుకోరు అన్నది బాబు ధీమాతో పాటు రాజకీయాన్ని విశ్లేషించి మరీ చెప్పారని అంటున్నారు.

ఇది టీడీపీ అధినేతగా ఆయన కోణంలో నుంచి చేసిన విశ్లేషణగా కూడా చూడాల్సి ఉంటుందని అంటున్నారు. మరో వైపు చూస్తే డిప్యూటీ సీఎం, కాబోయే సీఎం అని లోకేష్ విషయంలో జరుగుతున్న ప్రచారానికి కూడా ఫుల్ స్టాప్ పెట్తే విధంగా బాబు మాట్లాడారు అని అంటున్నారు.

కేవలం వారసత్వంతో ఎవరూ రాణించలేరు అని బాబు చెప్పుకొచ్చారు. లోకేష్ కి కుటుంబం పరంగా వ్యాపారం వారసత్వంగా ఉందని అయినా ఆయన ప్రజా సేవ చేయాలని ఆలోచించి రాజకీయాలోకి వచ్చారు అని చెప్పారు. అయితే వ్యాపారం చేయడమే చాలా సులువు అని బాబు వ్యాఖ్యానించడం గమనించదగినది.

లోకేష్ కష్టమైన రాజకీయ రంగాన్ని ఎంచుకున్నారు అని ఒక తండ్రిగా కంటే తలపండిన రాజకీయ నేతగా లోకేష్ గురించి బాబు ఇలా వ్యాఖ్యానించారు అనుకోవాల్సి ఉంటుంది. ఇక ఏ రంగంలో అయినా రాణించాలంటే వారసత్వం కంటే అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగడమే ముఖ్యమని బాబు అన్నారు.

దీనిని బట్టి లోకేష్ ఉప ముఖ్యమంత్రి తొందరలో పట్టాభిషేకం వంటి ప్రచారానికి బాబు దావోస్ వేదికగా చెక్ పెట్టేశారు అని అంటున్నారు. అంతే కాదు లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మంత్రిగా బాగా రాణిస్తున్నారు అన్నది బాబు భావనగా ఉంది అంటున్నారు.

ఆయన మరింత కాలం ఇదే తీరున పనిచేస్తూ దూకుడుగా సాగితేనే మేలు అన్నది కూడా ఆయనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ టెర్మ్ లో అంటే 2024 నుంచి 2029 మధ్యలో లోకేష్ కి ప్రమోషన్లు ఉండవన్న అర్ధం వచ్చేలా బాబు వ్యాఖ్యానించారా అన్న చర్చ సాగుతోంది. బాబుకు వారసత్వం ముఖ్యమే కానీ దాని కంటే పార్టీ గెలుపు ముఖ్యం.

అందువల్ల ఆయన మిత్రులతో కలసి ముందుకు సాగేందుకు చూస్తారని అంటున్నారు 2029లో మరోసారి గెలిస్తే మాత్రం బాబు తనదైన ఆలోచనలతో లోకేష్ కి పట్టాభిషేకం చేసేందుకు వెనకాడకపోవచ్చు అని అంటున్నారు. అంటే ఈ టెర్మ్ కి ఏపీలో ఏకైక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మాత్రమే ఉంటారని అంటున్నారు.

ఇల జగన్ మీద లోకేష్ మీద బాబు క్లారిటీతో ఉన్నట్లుగా ఆయన కామెంట్స్ బట్టి అర్ధం అవుతోంది. మరి మిత్రుడిగా జనసేన అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ విషయంలో బాబు ఆలోచనలు ఏమిటి అన్నది అయితే తెలియరావడం లేదు. ఇక ఏపీలో మరో రెండు టెర్ములు కూటమి అధికారంలోకి రావాలని ఎటూ పవన్ ఇప్పటికే ఆకాంక్షించారు. బాబు కూడా అదే ఆలోచిస్తున్నారు అని అర్ధం అవుతోంది. మొత్తానికి జగన్ కి నో చాన్స్ అని చెప్పడమే కాదు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పెద్ద మార్పులు ఉండవన్న సందేశాన్ని దావోస్ వేదికగా బాబు ఇచ్చారా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

Tags:    

Similar News