అసంతృప్తికి అంతులేదా.. ఇదేంటి తమ్ముళ్లూ..!
కొందరు పదువులు రాలేదని గోల.. వచ్చిన వారు.. సీట్లు లేవని గోల.. మొత్తంగా చూస్తే.. తెలుగు దేశంలో పార్టీలో నాయకుల అసంతృప్తికి అంతు లేకుండా పోయింది.;

కొందరు పదువులు రాలేదని గోల.. వచ్చిన వారు.. సీట్లు లేవని గోల.. మొత్తంగా చూస్తే.. తెలుగు దేశంలో పార్టీలో నాయకుల అసంతృప్తికి అంతు లేకుండా పోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఇప్పటికి సుమారు 450 మందికి పదవులు ఇచ్చారు. అయినా.. ఇవ్వని వారు కూడా ఉన్నారు. సరే.. పదవులు దక్కని వారికి ఆవేదన ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, పదవులు దక్కినప్పటికీ.. పదులు కాదు.. వందల్లోనే చాలా మంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఆదివారం శ్రీరామనవమి సందడి రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఇదేసమయంలో టీడీపీ నాయకులు మాత్రం.. పలు ప్రాంతాల్లో ప్రత్యేక భేటీలు నిర్వహించి.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. టీడీపీ నాయ కత్వాన్ని విమర్శిస్తూ.. `విందు` చేసుకోవడం గమనార్హం. వీరిలో చాలా మంది నాయకులు సీనియర్లే కావ డం మరో విశేషం. వీరిలో చాలా మంది పదువులు పొందిన వారే ఉన్నారు. మరి ఎందుకీ అసంతృప్తి? ఎందుకు ఈ గోల అంటే.. నాయకులు చెబుతున్న లాజిక్కువేరేగా ఉంది.
తమకు కీలక పదవులు ఇవ్వకుండా. . జంప్ చేసిన వారికి, ఎమ్మెల్యేలు చెప్పిన వారికి పదవులు ఇచ్చార న్నది వీరి ఆవేదన. మరికొందరు.. తమకు పదవులు ఇచ్చారు కానీ.. పవర్ లేనివంటూ.. పెదవి విరుస్తు న్నారు. కొందరు కుర్చీలు కూడా లేవని.. నొసటలు చిట్లిస్తున్నారు. ఇలా.. టీడీపీలో పదవుల గోల ఓ రేంజ్‌లో సాగుతోంది. గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి ఇప్పటికీ పదవులు దక్కలేదన్న వాదన ఒకవైపు వినిపిస్తూనే ఉంది.
మరోవైపు.. పదవులు దక్కించుకున్నవారు కూడా.. ప్రభుత్వానికి సహకరించకుండా చెవిలో జోరీగల్లా వ్యవహరించడం.. ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యేందుకు రెడీ అయ్యారన్న సమాచారం జిల్లాలకు చేరుతోంది. పదవులు దక్కించుకున్నవారు కూడా.. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం.. కూటమి పార్టీలను కలుపుకొని పోకుండా వ్యవహరించడం వంటివాటిపై చంద్రబాబు సీరియస్‌గానే ఉన్నారని అంటున్నారు పరిశీలకులు.