బాబు బాధ.. కూటమిది కాదా ..!
కానీ, ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలపై చెలరేగిన వివాదం విషయానికి వచ్చే సరికి.. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే బాధపడుతు న్నారు.
అధికారంలోకి వచ్చారు..పదవులు పంచుకున్నారు. మంత్రి సీట్లు.. ఇతర నామినేటెడ్ సీట్లను కూడా తీసుకున్నారు. అంటేసుఖాన్ని అందరూ కలిసి పంచుకున్నారు. కానీ, ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలపై చెలరేగిన వివాదం విషయానికి వచ్చే సరికి.. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే బాధపడుతు న్నారు. ఆయన ఒక్కరే వివరణ ఇవ్వాల్సి వస్తోంది. ఆయన ఒక్కరే స్పందించాల్సి కూడా వస్తోంది. మరి ఇలా చేయడంభావ్యమేనా? అనేది ప్రశ్న.
సుఖాలు కలిసి పంచుకుంటున్నప్పుడు.. కష్టం వచ్చినప్పుడు కూటమి పార్టీల నాయకులు కూడా స్పం దించాలి. ఎన్నికల సమయంలో తాము పథకాలు ప్రకటించలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. అది మొత్తానికే ముప్పు తీసుకువస్తుందని అంటున్నారు పరిశీలకులు. పథకాల మాట ఎలా ఉన్నా. . ఇప్పటి వరకు కూటమి చేసిన మంచినైనా.. పార్టీలు కలసి కట్టుగా ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలి. జనసేన, బీజేపీ నేతలు.. ముందుకు కదలాలి.
రాష్ట్ర పరిస్థితిని చంద్రబాబు ఒక్కరే వివరించడం ద్వారా.. ప్రజలకు అర్థమైనా కాకున్నా.. అందరూ కలివిడిగా ప్రజలను కలిసి.. పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తే.. దాని వల్ల వచ్చే పాజిటివిటీ వేరేగా ఉంటుంది. కానీ, ఆదిశగా కూటమి పార్టీలు ప్రయత్నించడం లేదు. బీజేపీ విషయానికి వస్తే.. అసలు మేనిఫెస్టోతో తమకు ఏమీ సంబంధం లేదన్నట్టే ఎన్నికలకు ముందు వ్యవహరించింది. తర్వాత కూడా.. అలానే ఉంది. పింఛన్ల పంపిణీలోనూ బీజేపీ నేతలు ఎక్కడా పాల్గొనడం లేదు.
ఇక, జనసేన నాయకులు కూడా.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ తీరును వివరించడంలో విఫలమవుతున్నారు. ఒక్క పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రమే ప్రజల మధ్య కనిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇతర నేతలు ఎందుకు కదలడం లేదన్నది కీలకం. ఇప్పటికై నా.. ముఖ్య నేతలు.. క్షేత్రస్థాయిలో పర్యటించి.. ప్రభుత్వ సానుకూలతలు వివరించడంతోపాటు పథకాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేయడం ద్వారా కూటమిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.